Sigma: ‘సిగ్మా’ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?

Updated on: Oct 10, 2026 | 7:03 PM

సందీప్‌ కిషన్‌ హీరోగా నటించిన ‘సిగ్మా’ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయం బయటపడింది. దర్శకుడు జేసన్‌ సంజయ్‌ తొలుత ఈ కథను మలయాళ స్టార్‌ దుల్కర్‌ సల్మాన్‌కు వినిపించారట. కథపై ఆసక్తి చూపినప్పటికీ, అప్పటికే ఇతర సినిమాలతో బిజీగా ఉండటంతో దుల్కర్‌ ఈ ప్రాజెక్ట్‌లో నటించలేకపోయారని సమాచారం. ఆ తర్వాత కథ సందీప్‌ కిషన్‌ వద్దకు వెళ్లగా, ఆయన వెంటనే అంగీకరించడంతో సినిమా పట్టాలెక్కింది.

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ నటించిన లేటెస్ట్ సినిమా ‘సిగ్మా’. తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ కుమారుడు జేసన్ విజయ్ మొదటి సారి మెగా ఫోన్ పట్టి ఈ సినిమాను తెరకెక్కించాడు. తెలుగమ్మాయి ఫరియా అబ్దుల్లా ఈ మూవీలో హీరోయిన్ గా చేసింది. రాజు సుందరం, సంపత్‌ రాజ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రిలీజ్ కు ముందు ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. టీజర్స్, గ్లింప్స్, ట్రైలర్ కూడా ఇంప్రెసివ్ గానే ఉన్నాయి. దీనికి తోడు హైదరాబాద్‌లో జరిగిన ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చి చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇలా రిలీజ్ కు ముందే ఈ మూవీపై పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యింది. అయితే గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 02 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సిగ్మా డీసెంట్ టాక్ తెచ్చుకుంది. అయితే ప్రస్తుతం సిగ్మా సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయటికి వచ్చింది. సిగ్మా సినిమాకు ముందుగా హీరోగా అనుకున్నది సందీప్ కిషన్ కాదట. దర్శకుడు జాసన్ సంజయ్ తొలుత ఈ స్టోరీని మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌తో చేయాలనుకున్నారట. అయితే అప్పటికే పలు సినిమాలతో దుల్కర్ బిజీగా ఉండడంతో ఈ సినిమా నుంచి తప్పుకున్నాడట. ఆ తర్వాత అదే కథ సందీప్ కిషన్ వద్దకు వెళ్లడం, వెంటనే ఒకే చెప్పడంతో సిగ్మా సినిమా పట్టాలెక్కిందట.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

OTTలోకి నాని ప్యారడైజ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే..

Virat-Anushka: రూ.44 కోట్లు.. విరుష్క లేటెస్ట్ లగ్జరీ ఇల్లు

Loading...
Unable to load recommendations.
Follow Us