S. S. Rajamouli: ఇంటర్నేషనల్ స్టేజ్‌ మీద రాజమౌళి క్రేజ్‌.. ఇంట్రస్టింగ్ విషయాలు చెప్పిన

Edited By:

Updated on: Jul 11, 2026 | 3:49 PM

అన్నేసీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘బాహుబలి ఎటర్నల్ వార్’ సందర్భంగా దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తన క్రియేటివిటీ వెనుక ఉన్న అసలు రహస్యాలను వెల్లడించారు. చిన్ననాటి అమర చిత్ర కథలు, హిందూ పురాణాలే తన సినిమాలకు ప్రేరణ అని చెప్పారు. ‘బాహుబలి ఎటర్నల్ వార్’తో భారతీయ యానిమేషన్ రంగానికి కొత్త అవకాశాలు తెరుచుకుంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ మధ్య కాలంలో రాజమౌళి ఎక్కడ మాట్లాడినా అది ఇంటర్నేషనల్ లెవల్‌లో సెన్సేషన్ అవుతోంది. రీసెంట్‌గా అన్నేసీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘బాహుబలి ఎటర్నెల్ వార్’ ప్రీమియర్‌ సందర్భంగా వెస్ట్రన్ మీడియాతో మాట్లాడారు రాజమౌళి. ఈ ఇంటర్వ్యూలో జక్కన్న తన క్రియేటివిటీకి బేసిస్ ఏంటో, తన సినిమా మేకింగ్ వెనుకున్న అసలు రహస్యాలేంటో క్లియర్‌గా రివీల్ చేశారు. ట్రిపులార్‌ తరువాత మరోసారి బాహుబలి ఎటర్నల్‌ వార్‌తో వరల్డ్ ఆడియన్స్‌ను పలకరించబోతున్నారు రాజమౌళి ఈ సందర్భంగా వరల్డ్ మీడియాతో మాట్లాడిన జక్కన్న , దర్శకుడిగా మారాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది. ఒక కథను ఎలా సెలెక్ట్ చేసుకుంటారు అన్న విషయాలు రివీల్ చేశారు. ఇండియా లాంటి దేశంలో పుట్టడాన్ని తాను అదృష్టంగా భావిస్తున్నానని గర్వంగా చెప్పారు రాజమౌళి. తన క్రియేటివిటీ బేసిస్ చిన్నప్పుడు విన్నచ, చదివిన అమర చిత్ర కథలే అని, తన సినిమాలకు అసలైన ‘ఫ్యూయల్’ హిందూ మైథలాజీనే అన్నారు. ఇండియాలో యానిమేషన్ పవర్‌ని ఇంకా పూర్తిగా వాడుకోలేదన్న జక్కన్న, ‘బాహుబలి ఎటర్నెల్ వార్’ తరువాత ఇండియన్ యానిమేషన్ ఇండస్ట్రీకి న్యూ గేట్స్ ఓపెన్ అవుతున్నాయన్న ధీమా వ్యక్తం చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏంటి? పవన్‌ సినిమాలో ఛాన్స్ వస్తే వదులుకుందా?

V. V. Vinayak: ఆ సినిమా చేసి తప్పు చేశా.. వినాయక్ భావోద్వేగం

Naga Durga: బిగ్ బాస్‌ బంపర్ ఆఫర్.. కానీ.. ఇడుపు కాయితం ఫేమ్ నాగ దుర్గ షాకింగ్ రీజన్

Naga Vamsi: బుక్‌మైషో బండారం బయటపెట్టిన నాగ వంశీ..

బిగ్ స్క్రీన్ మీద బిగ్ చేంజ్‌… ఆడియన్స్‌ టేస్ట్ మారుతోందా..?

Published on: Jul 11, 2026 03:48 PM
Follow Us