Rajamouli: ఒక్క హాలీవుడ్ మూవీ అయినా చేస్తా
‘ఆర్ఆర్ఆర్’ గ్లోబల్ విజయంతో హాలీవుడ్ స్టూడియోల నుంచి పలు ఆఫర్లు వచ్చాయని దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి వెల్లడించారు. కనీసం ఒక్క హాలీవుడ్ సినిమా అయినా చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. అయితే తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘వారణాసి’ కోసం ఆ అవకాశాలను పక్కన పెట్టినట్లు చెప్పారు. మహేశ్ బాబు నటిస్తున్న ఈ సినిమా షూటింగ్లో మరో పది రోజుల పని మాత్రమే మిగిలిందని, 2027 ఏప్రిల్ 7న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో గ్లోబల్ లెవల్లో క్రేజ్ తెచ్చుకున్న దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, ప్రస్తుతం మహేశ్ బాబుతో ‘వారణాసి’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పాన్ వరల్డ్ రేంజ్లో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌పై జక్కన్న ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. అంతేకాదు, ఆర్ఆర్ఆర్ తర్వాత తనకు వచ్చిన హాలీవుడ్ ఆఫర్స్, తన ఫ్యూచర్ ప్లాన్స్‌పై ఫస్ట్ టైమ్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ వేదికపై మెరిసినప్పటి నుంచీ రాజమౌళి హాలీవుడ్ ఎంట్రీపై ఇండస్ట్రీలో రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. రీసెంట్గా బ్రెజిల్లో జరుగుతున్న 50వ సావో పాలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొన్న జక్కన్న.. అక్కడి మీడియాతో ఇంట్రస్టింగ్ విషయాలు షేర్ చేశారు. ఆర్ఆర్ఆర్ గ్లోబల్ సక్సెస్ తర్వాత తనకు హాలీవుడ్ స్టూడియోల నుంచి చాలా ఆఫర్లు వచ్చాయని, అందులో కొన్ని అవకాశాలు ఇప్పటికీ ఓపెన్‌గానే ఉన్నాయని రివీల్ చేశారు. హాలీవుడ్ వర్క్ కల్చర్, అక్కడి ప్రొడక్షన్ స్టైల్ అంటే తనకు ఎంతో ఇష్టమని, అక్కడి మేకింగ్ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందన్నారు జక్కన్న. అందుకే కనీసం ఒక్క హాలీవుడ్ సినిమా అయినా చేయాలనుందని తన మనసులో మాట బయటపెట్టారు. అయితే ఆర్ఆర్ఆర్ టైమ్‌కే తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘వారణాసి’ ప్రీ-ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయని.. ఒకేసారి రెండు, మూడు ప్రాజెక్టులపై ఫోకస్ చేయడం తన వల్ల కాదు కాబట్టే హాలీవుడ్ ఆఫర్లను హోల్డ్‌లో పెట్టినట్లు క్లారిటీ ఇచ్చారు. మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘వారణాసి’ షూటింగ్‌పై కూడా రాజమౌళి బిగ్ అప్డేట్ ఇచ్చారు. భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఇప్పటికే పూర్తయ్యాయని, కేవలం మరో 10 రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని ఫ్యాన్స్‌ను సర్ప్రైజ్ చేశారు. ఐమ్యాక్స్ ఫార్మాట్లో సింగిల్ పార్ట్‌గా రూపొందుతున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీని 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు. ‘వారణాసి’తో బాక్సాఫీస్ రికార్డులు షేక్ చేసిన తర్వాత జక్కన్న హాలీవుడ్ ఎంట్రీ ఇస్తారేమో చూడాలి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Husharu 2: వేరే సినిమాల్లో నటించని పీపుల్ స్టార్.. హుషారు2లో నటించారు.. ఎందుకో తెలుసా..
Janhvi Kapoor: కన్నీళ్లతో.. మనసులోని ప్రేమను బయటపెట్టిన జాన్వీ
Bigg Boss Telugu: బిగ్ బాస్ లోగుట్టును.. బయటపెట్టిన గీతూ రాయల్
ఒక్కో ఇన్విటేషన్ కార్డ్‌కు.. మరీ అంత ఖర్చు పెట్టారా?
Ranabaali: టాక్ ఏదైనా తగ్గేదేలే.. బాక్సాఫీస్ వద్ద రణబాలి రికార్డ్..!