2026లో ఈగ రీ రిలీజ్ కు ఏర్పాట్లు వీడియో
ట్రిపుల్ ఆర్ తర్వాత రాజమౌళి సుదీర్ఘ విరామం తీసుకున్నారు. వారణాసి చిత్రం 2027లో రానుండగా, ఆ గ్యాప్‌ను పూరించడానికి జక్కన్న టీమ్ ఈగ సినిమాను 2026లో రీ-రిలీజ్ చేయాలని నిర్ణయించింది. బాహుబలి ది ఎపిక్ విజయం తర్వాత, ఈ క్లాసిక్‌ను లేటెస్ట్ టెక్నాలజీతో రీ మాస్టర్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
ట్రిపుల్ ఆర్ విజయవంతం అయిన తర్వాత దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి సుదీర్ఘ విరామం తీసుకున్నారు. ఆయన తదుపరి చిత్రం వారణాసి 2027లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ సుదీర్ఘ విరామం వల్ల ప్రేక్షకులు రాజమౌళి మార్క్ విజువల్స్ ను మిస్ కాకుండా ఉండేందుకు ఆయన ఒక వినూత్న ప్రణాళికను సిద్ధం చేశారు. ఇటీవలే బాహుబలి సినిమాను బాహుబలి ది ఎపిక్ పేరుతో ఒకే భాగంగా రీ-రిలీజ్ చేసి సాంకేతికంగానూ అప్‌గ్రేడ్ చేశారు. ఇది ఘన విజయం సాధించడంతో, ఇప్పుడు మరో రాజమౌళి క్లాసిక్‌ను రీ-రిలీజ్ చేయడానికి ఆయన బృందం సన్నాహాలు చేస్తోంది.
మరిన్ని వీడియోల కోసం :
