Fauzi: ప్రభాస్ ఫౌజీ సినిమా టీంకు ప్రమాదం.. షూటింగ్‌కు బ్రేక్!

Updated on: May 07, 2026 | 12:28 PM

హనురాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న 'ఫౌజీ' సినిమా యూనిట్‌కు హైదరాబాద్ శివార్లలోని అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. మే 5న షూటింగ్‌కు వెళ్తుండగా వెహికల్ డివైడర్‌ను ఢీకొంది. ఈ దుర్ఘటనలో ఒకరు మృతి చెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం 'ఫౌజీ' షూటింగ్ తాత్కాలికంగా నిలిచిపోయింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

హనురాఘవపూడి డైరెక్షన్లో ప్రభాస్‌ చేస్తున్న మోస్ట్ అవేడెట్ మూవీ ఫౌజీ. ఎట్ ప్రజెంట్ జెట్ స్పీడ్‌లో షూటింగ్ జరుగుతున్న ఈ మూవీ టీంకు ప్రమాదం జరిగింది. ఈ మూవీ టీం ప్రయాణిస్తున్న వెహికల్‌కి ప్రమాదం జరగడం ఇప్పుడు ఇండస్ట్రీలో షాకింగ్‌గా మారింది. మే 05.. ఉదయం.. ఫౌజీ షూటింగ్‌ కోసం వెళుతున్న యూనిట్ సభ్యుల వాహనం హైదరాబాద్ శివార్లలోని అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద డివైడర్‌ను ఢీకొంది.ఈ విషాదకర ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే ఫౌజీ యూనిట్ షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేసిందని తెలుస్తోంది. అంతేకాదు ఈ ప్రమాదం పై పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TVK Vijay: అప్పుడు NTR, ఇప్పుడు విజయ్‌! బ్రహ్మంగారు చెప్పిందే నిజమైంది..

Loading...
Unable to load recommendations.
Follow Us