Sheezan Khan: నటి ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్.. తల్లే హంతకురాలు..? వీడియో..

|

Jan 04, 2023 | 7:19 PM

సస్పెన్స్ క్రైమ్ థిల్లర్‌లా సాగుతోంది యాక్టరస్‌ తనీషా శర్మా సూసైడ్ కేస్. షూటింగ్ స్పాట్లోనే సూసైడ్ చేసుకుని చనిపోయిన ఈ యాక్టరస్ .. కేసు సంచలనంగా మారింది.


సస్పెన్స్ క్రైమ్ థిల్లర్‌లా సాగుతోంది యాక్టరస్‌ తనీషా శర్మా సూసైడ్ కేస్. షూటింగ్ స్పాట్లోనే సూసైడ్ చేసుకుని చనిపోయిన ఈ యాక్టరస్ .. కేసు సంచలనంగా మారింది. ఈమె మరణానికి కారణం ఆమె భాయ్‌ ఫ్రెండ్ హీరో షీజాన్‌ అని పోలీసులు నిర్దారణకు రావడం అతడిని అరెస్ట్ చేయడం కూడా సెన్సేషన్ గానే మారింది. కాని ఇప్పుడు తనీషా మృతికి తన తల్లే కారణమే టాక్ అందరికీ బిగ్ ట్విస్ట్ లా మారింది. ఎస్ ! తనీషా బాయ్‌ ఫ్రెండ్ షీజాన్ ఖాన్ పేరెంట్స్ చెబుతున్న ప్రకారం.. తనీషా మరణానికి.. ఆమె సూసైడ్ చేసుకోడానికి కారణం ఆమె తల్లే అట. ఆ విషయం కూడా తనే చాలా సందర్భాల్లో చెప్పి బాధపడిందనేది వారి మాట. ఇక ఇదే మాటను మీడియా సాక్షిగా బాంబే పోలీసుల ముందు పెట్టారు షీజాన్ ఖాన్ పేరెంట్స్ . పెట్టడమే కాదు.. తన తల్లికి కాస్త సన్నిహితుడైన.. సంజీవ్ కౌశల్ ను కూడా విచారించాలని వారిని కోరారు. తనీషా మామ అని చెప్పుకునే ఆయనే.. తనీషా తల్లితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నట్టు వారు ఆరోపించారు కూడా..!”కూతురు చనిపోయిందని ఇప్పుడు ఏడుస్తున్న ఆమె.. స్వయంగా కూతురును చంపాలనుకొంది. తునీషా మామగా చెప్పుకుంటున్న సంజీవ్ కౌశల్ కు, ఆమె తల్లికి మధ్య ఏదో సంబంధం ఉందని,అది షీజాన్ కు తెలిసి ప్రశ్నించడంతో ఆమె, అతడిపై కక్ష కట్టింది. తునీషాకు ఇష్టంలేని పనులను వీరిద్దరూ కలిసి ఎన్నో చేయించారు. కరోనా లాక్స్ డౌన్ సమయంలో ఆమెకు ఇష్టం లేకుండా చండీఘర్ కు పంపించాలని చూశారు. తునీషా వెళ్ళను అని గట్టిగా చెప్పడంతో ఆమెను కొట్టి, ఫోన్ పగులకొట్టి.. గొంతుకోసి చంపాలనుకున్నారు. ఈ విషయాన్నీ తునీషా, తను నటిస్తున్న షో డైరెక్టర్ తో చెప్పుకొని బాధపడింది. ఇవన్నీ ఆమె కప్పిపుచ్చడానికి కూతురిపై ప్రేమ ఉన్నట్లు నటిస్తోంది” అని వారు చెప్పుకొచ్చారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Crocodile-drone: అబ్భాబ్భా ఎం వీడియో గురు.. తనను క్యాప్చర్‌ చేస్తున్న డ్రోన్‌ను మొసలి ఏం చేసిందో చూస్తే..

School childrens: స్కూల్‌ పిల్లల్లోకి ఆత్మలు.. తాంత్రికుడిని పిలిచి పూజలు నిర్వహణ.. ఎవరో తెలిస్తే షాకే.!

Car accident: డ్రైవర్‌ ర్యాష్‌ డ్రైవింగ్‌.. ప్రశ్నించినందుకు కారుతో ఢీకొట్టి.. నడిరోడ్డుపై దారుణంగా.. వీడియో.

Published on: Jan 04, 2023 07:19 PM