Sharwanand: శర్వానంద్ గ్రాండ్ రీఎంట్రీ.. ఒక్క హిట్టుతో జోరు మాములుగా లేదుగా
'నారీనారీ నడుమ మురారి' విజయంతో శర్వానంద్‌లో సరికొత్త జోష్ వచ్చింది. వరుస పరాజయాల తర్వాత ఈ హిట్ ఆయన కెరీర్‌కు ఊపిరి పోసింది. 2026-2027 సంక్రాంతి మధ్య ఏకంగా 4 సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. బైకర్, భోగి వంటి చిత్రాలతో పాటు శ్రీను వైట్ల సినిమాతో తిరిగి విజయాల బాట పట్టాలని శర్వానంద్ చూస్తున్నారు. ఇది ఆయన సెకండ్ ఇన్నింగ్స్‌కు నాంది.
ఎవరెన్ని చెప్పినా గెలుపు తీసుకొచ్చే జోష్ ఇంకేది తీసుకురాదు.. ఎన్ని ప్లాపులున్నా ఒక్క హిట్ వచ్చిందంటే కనిపించే ఆ జోరు వేరు.. స్పీడ్ వేరు. ఇప్పుడు శర్వానంద్‌లో కూడా ఇదే కనిపిస్తుంది. కొన్నేళ్లుగా ఫ్లాపుల్లో ఉన్న ఈ హీరోకు.. నారీనారీ గాడిన పడేసింది. దాంతో ఏడాది తిరక్కుండానే మరో మూడు సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. మరి శర్వా ప్లాన్ ఏంటి..? ఒక్క హిట్ శర్వానంద్‌లో ఎక్కడ లేని జోష్ నింపింది.. 2017లో శతమానం భవతి, మహానుభావుడు తర్వాత తొమ్మిదేళ్ళ పాటు గెలుపు కోసం దండయాత్ర చేసారు శర్వా. మధ్యలో ఒకే ఒక జీవితం ఓకే అనిపించింది. ఆ తర్వాత మనమే నిరాశ పరిచింది. ఇలాంటి సమయంలో నారీనారీ నడుమ మురారితో మచ్ నీడెడ్ హిట్ అందుకున్నారు శర్వానంద్. ఎలాంటి అంచనాలు లేకుండా.. ప్రమోషన్స్ లేకుండా సైలెంట్‌గా వచ్చిన నారీనారీ సూపర్ హిట్‌గా నిలిచింది. ఎక్స్‌ప్రెస్ రాజా, శతమానం భవతి తర్వాత పండక్కి హ్యాట్రిక్ పూర్తి చేసారు శర్వా. ఈ హిట్‌తో 2026 సంక్రాంతి టూ 2027 సంక్రాంతి లోపు 4 సినిమాలు ప్లాన్ చేస్తున్నారు ఈ హీరో. ఆల్రెడీ నారీ నారీ వచ్చింది.. మార్చిలో బైకర్ సినిమా విడుదల కానుంది. బైకర్ షూటింగ్ ఇప్పటికే పూర్తైంది.. ఫిబ్రవరిలో ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నారు. ఇక సంపత్ నంది తెరకెక్కిస్తున్న భోగి సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. 1960స్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. 2027 సంక్రాంతికి శ్రీను వైట్ల, మైత్రి మూవీ మేకర్స్ సినిమాతో రానున్నారు శర్వా. ఇవన్నీ హిట్టైతే.. శర్వా సెకండ్ ఇన్నింగ్స్ జోరందుకున్నట్లే..!
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ముద్దుగుమ్మల ఆశలు అడియాశలు.. సంక్రాంతికి అనుకోని షాక్
Trivikram: త్రివిక్రమ్ ‘అ’ అక్షరం టైటిల్ సెంటిమెంట్.. ఈ సారి హిట్టు పక్క
2027 సంక్రాంతికి 4 బెర్తులు కన్ఫర్మ్.. ఏ సినిమాలో తెలుసా ??