ఓటీటీ కంటెంట్‌కు సెన్సార్‌ నిబంధనలు తెచ్చే ఆలోచనలో కేంద్రం

Edited By:

Updated on: Jul 13, 2026 | 5:44 PM

దిల్‌జిత్ దోసాంజ్ నటించిన ‘సత్లుజ్’ విడుదలైన 48 గంటల్లోనే ఓటీటీ నుంచి తొలగించడంతో డిజిటల్ కంటెంట్ నియంత్రణపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఇప్పటికే ‘రానా నాయుడు’, ‘ఆశ్రమ్’, ‘తాండవ్’ వంటి వెబ్ సిరీస్‌లతో సెన్సార్ అవసరమన్న డిమాండ్ వినిపిస్తుండగా, తాజా పరిణామం ఓటీటీలకు కూడా కఠిన నియంత్రణలు తీసుకురావాలా అనే ప్రశ్నను మరోసారి తెరపైకి తీసుకొచ్చింది.

రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన సత్లుజ్‌ మూవీని రిలీజ్ చేసిన రెండు రోజుల్లోనే ఓటీటీ నుంచి కూడా తొలగించటం మీద నేషనల్ లెవల్‌లో డిస్కషన్ జరుగుతోంది. ఈ సినిమా నేపథ్యంలో కొద్ది రోజులుగా మరుగున పడిన ఓటీటీకి సెన్సార్ చేయాల్సిందే అన్న డిమాండ్‌ను మరోసారి తెర మీదకు తీసుకువచ్చింది. నిజంగా డిజిటల్‌ కంటెంట్‌కు సెన్సార్ సాధ్యమేనా..? ఓటీటీ కంటెంట్‌కు సెన్సార్ చేయాలన్న వాదన ఇప్పుడు కొత్తగా తెర మీదకు వచ్చిందేం కాదు. గతంలో వెంకటేష్‌, రానా హీరోలుగా తెరకెక్కిన రానా నాయుడు రిలీజ్‌ సమయంలోనూ ఇదే డిస్కషన్ జరిగింది. అప్పట్లో ఫ్యామిలీ హీరో ఇమేజ్‌ ఉన్న వెంకటేష్ ఇలాంటి షోలో నటించటం ఏంటి అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు ఆడియన్స్‌. రానా నాయుడుతో పాటు ఆశ్రమ్, తాండవ్ లాంటి సిరీస్‌లు కూడా తీవ్ర విస్పదమయ్యాయి. ఆ సమయంలో ఓటీటీ ప్రాజెక్ట్స్‌కి కూడా సెన్సార్ ఉండాల్సిందే అన్న డిమాండ్స్‌ తెర మీదకు వచ్చాయి. ఆడియన్స్‌ పర్సనల్ ఇంట్రస్ట్‌తో టికెట్‌ కొనుకొన్ని థియేటర్లకు వెళ్లి చూసే సినిమాలనే సెన్సార్ చేస్తున్నప్పుడు. ఇంట్లో అందరికీ అందుబాటులో ఉండే ఓటీటీ కంటెంట్‌ మీద నియంత్రణ లేకపోతే ఎలా అన్నది విశ్లేషకుల మాట. ఓటీటీలకు సెన్సార్ విధించటం థియేట్రికల్‌ రిలీజ్‌కు హెల్ప్ అవుతుందన్న టాక్‌ వినిపిస్తోంది. రీసెంట్ టైమ్స్‌లో థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలకు కూడా ఓటీటీలో అన్‌సెన్సార్డ్ వర్షన్స్‌ రిలీజ్ చేస్తున్నారు. ఈ ఎఫెక్ట్ థియేట్రికల్ మార్కెట్ మీద గట్టిగానే పడుతోంది. అందుకే ఓటీటీ కంటెంట్‌కి కళ్లెం వేస్తే అది బిగ్ స్క్రీన్‌కు కూడా హెల్ప్ అవుతుందన్న వాదన వినిపిస్తోంది. మరి నిజంగానే ఓటీటీలను నియంత్రించటం సాధ్యమేనా..? చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రశాంతమైన మరణానికి మార్గం సుగమం!!

రైల్లో రెచ్చిపోయిన కొత్తజంట.. దెబ్బకు టీసీ ఉద్యోగం ఊస్ట్‌!

ఈసీజీ కూడా కనిపెట్టలేనిది.. ఏఐ కనిపెట్టేసిందిగా!

Rao Bahadur: స్టార్ హీరో చేయాల్సిన సినిమా.. సత్యదేవ్‌ ఖాతాలోకి వచ్చింది!

ఉప్పునీటితో విద్యుత్‌.. సముద్ర గర్భంలో సరికొత్త విప్లవం

Follow Us