అందాల భామల ఆశలన్నీ ఆ పండుగ మీదే!

Edited By:

Updated on: Nov 09, 2026 | 6:16 PM

2027 సంక్రాంతి బరిలో హీరోలతో పాటు హీరోయిన్ల భవిష్యత్తు కూడా ఆసక్తికరంగా మారనుంది. కీర్తి సురేష్‌, కృతి శెట్టి, అనస్వర రాజన్‌, కాజల్‌ అగర్వాల్‌, ఐశ్వర్య లక్ష్మి, మానస వారణాసి వంటి నటీమణులు తమ సినిమాలపై ఆశలు పెట్టుకున్నారు. వరుస పరాజయాల తర్వాత సక్సెస్‌ కోసం ఎదురుచూస్తున్న కొందరికి ఈ పండగ సీజన్‌ కీలకంగా మారనుంది. ఏ సినిమా ఎవరికి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

సాధారణంగా సంక్రాంతి అంటే స్టార్ హీరోల మధ్య పోటి ఉంటుంది. కానీ 2027 పొంగల్ మాత్రం హీరోల కంటే హీరోయిన్లకే కీలకంగా మారబోతోంది. వరుస ప్లాపులతో ఇబ్బంది పడుతున్న బ్యూటీస్‌, టాలీవుడ్‌లో సాలిడ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న హీరోయిన్లు… ఈ పండగ బరిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. చాలా రోజులుగా బిగ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న కీర్తి సురేష్‌, కృతి శెట్టి.. ఇప్పుడు ఒకే మూవీ మీద ఆశలు పెట్టుకున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్‌గా వస్తున్న జనవరి 12 విడుదల సినిమాతో మళ్లీ సక్సెస్‌ ట్రాక్‌లోకి రావాలని ఆశపడుతున్నారు. మెగాస్టార్‌ మూవీ కాకాలో సపోర్టింగ్ రోల్‌ చేస్తున్న అనస్వర కూడా ఆ సినిమాతో టాలీవుడ్‌లో జెండా పాతేయాలని కష్టపడుతున్నారు. మరోవైపు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ దాదా. క్రిస్మస్‌కే రావాల్సిన ఈ సినిమా సంక్రాంతి రేసులోకి వచ్చే ఛాన్స్ ఉందనే టాక్ నడుస్తోంది. భగవంత్ కేసరి తర్వాత బాలయ్యతో మళ్లీ జతకట్టిన కాజల్ అగర్వాల్‌కు సెకండ్ ఇన్నింగ్స్‌లో స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇవ్వడానికి ఇదే బెస్ట్ ఛాన్స్. సాయిదుర్గతేజ్‌ సంబరాల ఏటి గట్టులో ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. టాలీవుడ్‌లో మంచి బ్రేక్‌ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఈ బ్యూటీ సంబరాల ఏటి గట్టు తన కెరీర్‌ను మలుపు తిప్పుతుందన్న నమ్మకంతో ఉన్నారు. మొత్తానికి 2027 సంక్రాంతి సీజన్ సీనియర్ల నుంచి యంగ్ హీరోయిన్ల వరకు అందరి ఫ్యూచర్‌ను డిసైడ్ చేయబోతోంది. కపుల్ ఫ్రెండ్లీతో మెప్పించిన మానస వారణాసి కూడా సంక్రాంతి రేసులో ఉన్న జార్జ్‌ క్రిష్ సినిమాతో హిట్ హీరోయిన్ అనిపించుకోవాలని కష్టపడుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రూ.40 కోట్లు ఇస్తేనే ఉంటాం.. స్టార్ ప్లేయర్ల భారీ డిమాండ్

కాశీలో ట్రాఫిక్‌ కష్టాలకు చెక్.. దేశంలోనే తొలి పబ్లిక్‌ రోప్‌వే సిద్ధం

ఆటో ఎక్కితే అంతే సంగతులు.. మహిళలే టార్గెట్

విమానయాన రంగంలో కొత్త శకం.. 90 ఏళ్ల నాటి చట్టం రద్దు

రాపిడో డ్రైవర్‌తో ప్రేమలో పడిన యువతి.. వైరల్ లవ్ స్టోరీ!

Loading...
Unable to load recommendations.
Follow Us