బడ్జెట్ రికార్డులు బ్రేక్ చేస్తున్న సంజయ్ లీలా భన్సాలి
సాధారణంగా సినిమాల బడ్జెట్ అంచనాలకు లోబడే ఉంటుంది. కానీ సంజయ్ లీలా భన్సాలీ లవ్ అండ్ వార్ చిత్రం విషయంలో అది మారిపోయింది. ₹250 కోట్ల బడ్జెట్‌తో ప్రారంభమైన ఈ సినిమా ఇప్పటికే ₹425 కోట్లకు పైగా ఖర్చు చేసింది. రణ్‌బీర్ కపూర్, విక్కీ కౌశల్, ఆలియా భట్‌ల కాంబినేషన్ ఈ భారీ బడ్జెట్‌ను సమర్థిస్తుందని భన్సాలీ నమ్మకం.
సాధారణంగా సినిమాల బడ్జెట్ ఒక అంచనాకి వచ్చిన తర్వాతే ప్రాజెక్టులు సెట్స్ మీదకు వస్తాయి. అనుకున్న బడ్జెట్‌కు 10-20 శాతం అటు ఇటుగా సినిమా పూర్తవుతుంది. అయితే బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ రూపొందిస్తున్న తదుపరి చిత్రం విషయంలో ఈ అంచనాలు పూర్తిగా తారుమారయ్యాయి. అనుకున్న బడ్జెట్‌కు రెట్టింపు ఖర్చు అవుతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌లో భారీ బడ్జెట్ చిత్రాలకు సంజయ్ లీలా భన్సాలీ ప్రసిద్ధి. ప్రస్తుతం ఆయన రణ్‌బీర్ కపూర్, విక్కీ కౌశల్, ఆలియా భట్ ప్రధాన పాత్రల్లో లవ్ అండ్ వార్ అనే ట్రయాంగులర్ లవ్ స్టోరీని తెరకెక్కిస్తున్నారు. దాదాపు రెండేళ్లుగా ఈ సినిమా పనుల్లోనే యూనిట్ నిమగ్నమై ఉంది. మొదట ఈ చిత్రానికి ₹250 కోట్ల బడ్జెట్ అనుకోగా, ఇప్పటికే ₹425 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు మేకర్స్ చెబుతున్నారు. బడ్జెట్ భారీగా పెరిగినప్పటికీ, భన్సాలీ సినిమా విషయంలో పూర్తి విశ్వాసంతో ఉన్నట్లు సమాచారం. రణ్‌బీర్, విక్కీ, ఆలియా వంటి స్టార్ నటీనటులు ఉండటం, అలాగే రణ్‌బీర్, ఆలియా బ్రహ్మాస్త్ర తర్వాత మళ్ళీ కలిసి నటిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ కారణంగా బడ్జెట్ ఎంత పెరిగినా బిజినెస్ సులభంగా జరుగుతుందని చిత్ర బృందం అంచనా వేస్తోంది. లవ్ అండ్ వార్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Tamannaah Bhatia: బిజినెస్ పాఠాలు చెబుతున్న మిల్కీ బ్యూటీ తమన్నా
అమెరికాలో సడెన్ గా కుంగిన భూమి.. గుంతలో పడ్డ కార్లు
Pomegranate: ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దానిమ్మ తింటే.. అంతే సంగతులు