Maa Inti Bangaram: ఉత్తర అమెరికాలో ‘మా ఇంటి బంగారం’ సరికొత్త రికార్డు!

Updated on: Jul 07, 2026 | 4:46 PM

సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఇంటి బంగారం’ ఓవర్సీస్‌లో 2 మిలియన్ డాలర్ల వసూళ్లను దాటిన తొలి సోలో తెలుగు మహిళా ప్రధాన చిత్రంగా చరిత్ర సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.85 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించిన ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్‌ వైపు దూసుకెళ్తోంది. నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది.

స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన ఫ్యామిలీ యాక్షన్​ డ్రామా ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. జూన్ 19న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఏకంగా 2 మిలియన్ డాలర్ల వసూళ్ల మైలురాయిని అధిగమించింది. ఈ విషయాన్ని అక్కడ సినిమాను విడుదల చేసిన ప్రముఖ పంపిణీ సంస్థ ‘ప్రత్యాంగిర సినిమాస్’ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా వెల్లడించింది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక సోలో ఫీమేల్ లీడ్ సినిమా, అమెరికాలో ఈ స్థాయి భారీ వసూళ్లను సాధించడం ఇదే తొలిసారి. తద్వారా సమంత టాలీవుడ్‌లో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఈ చిత్రం ఇప్పటివరకు రూ. 85 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి రూ. 100 కోట్ల క్లబ్‌ వైపు దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ మహిళా ప్రధాన చిత్రాల విభాగంలో పాత రికార్డులన్నింటినీ ఈ సినిమా తుడిచిపెట్టేసింది. ప్రముఖ దర్శకురాలు నందిని రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రంలో సమంత నటనకు గానూ ప్రేక్షకుల నుంచే కాకుండా ఇండస్ట్రీలోని అగ్ర హీరోల నుంచి కూడా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సమంత వన్-మెన్ షోగా నిలిచిన ‘మా ఇంటి బంగారం’ లాంగ్ రన్‌లో మరిన్ని రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నీ ‘సర్‌’ చల్లగుండ.. పెళ్లి కూడా చేసుకోనివ్వడంలేదుగా

నాన్‌వెజ్ ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన చికెన్‌, ఎగ్స్‌ ధర

రెప్పపాటులో తప్పిన పెను ప్రమాదం..

రాజస్థాన్‌లో రాక్షసకాండ! 13 ఏళ్ల బాలికపై 30 మంది మృగాళ్ల అరాచకం

వామ్మో.. రక్త జలపాతం.. వందేళ్ల మిస్టరీని ఛేదించిన శాస్త్రవేత్తలు!

Follow Us