Samantha Ruth Prabhu: 100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్

Edited By:

Updated on: Jul 14, 2026 | 6:17 PM

సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’ ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ వసూలు చేసి తెలుగు సినిమా చరిత్రలో తొలి మహిళా ప్రధాన చిత్రంగా అరుదైన రికార్డు సృష్టించింది. ‘మహానటి’ పేరిట ఉన్న రికార్డును అధిగమించిన ఈ విజయం తర్వాత హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలపై ఇండస్ట్రీలో నమ్మకం మరింత పెరిగింది. ఐశ్వర్య రాజేష్, కాజల్, రష్మిక తదితర హీరోయిన్లు కూడా బలమైన కథలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

100 కోట్లు.. స్టార్ హీరోల సినిమాలకు ఇది ఒక్కరోజు వచ్చే కలెక్షన్లు కానీ లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు లైఫ్ టైమ్‌లో కూడా సాధ్యం కాని కలెక్షన్లు. 100 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటి వరకు 100 కోట్ల గ్రాస్ దాటిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలే లేవంటే నమ్మడం సాధ్యమేనా..? ఇన్నేళ్లకు ఆ అద్భుతం జరిగింది.. బాక్సాఫీస్ కాస్తా బంగారంలా మారిపోయింది..! కొన్నాళ్లుగా అనుకుంటున్నదే.. సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’ కొత్త చరిత్ర రాసింది.. ఈ చిత్రం 100 కోట్ల క్లబ్‌లోకి అడుగు పెట్టింది. తెలుగులో అత్యధిక వసూళ్లు సాధించిన ఫీమేల్ సెంట్రిక్ మూవీగా ఇప్పటికే రికార్డ్ క్రియేట్ చేసిన మా ఇంటి బంగారం.. తాజాగా 100 కోట్ల క్లబ్బులోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో సెంచరీ కొట్టిన తొలి హీరోయిన్‌గా నిలిచారు స్యామ్. మహానటి పేరిట ఉన్న 77 కోట్లే మొన్నటి వరకు ఫీమేల్ సెంట్రిక్ సినిమాల్లో రికార్డ్.. ఈ రికార్డును చాలా సునాయాసంగా తిరగరాసారు సమంత. పెద్ద బ్రేక్ తీసుకుని వచ్చినా.. రికార్డ్ బ్రేకింగ్ హిట్ కొట్టారు స్యామ్. ‘మా ఇంటి బంగారం’ ఇచ్చిన జోష్‌తో ఉమెన్ సెంట్రిక్ సినిమాలపై అంచనాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ‘ఓ సుకుమారి’తో జూలై 17న వస్తున్నారు ఐశ్వర్య రాజేష్. అలాగే సీనియర్ హీరోయిన్ కాజల్ నటిస్తున్న ‘ది ఇండియా స్టోరీ’ సినిమా జూలై 24న రానుంది. వ్యవసాయంలో వాడే రసాయనాల వల్ల జరిగే అనర్థాల గురించి ఇందులో వివరంగా చూపించబోతున్నారు. గతేడాది గర్ల్‌ఫ్రెండ్‌ సినిమాతో హిట్ కొట్టిన రష్మిక.. ఈ ఏడాది ‘మైసా’తో రానున్నారు. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మొత్తానికి హీరోయిన్లంతా బలమైన కథలతో వస్తుండటం ఆసక్తి పెంచే విషయమే.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం.. భయంతో వణికిపోయిన అర్చకుడు

మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్

BSNL: బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా!

పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు

స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం

Follow Us