Bigg Boss Sunny: బిగ్ బాస్ విజేత సన్నీ‌పై రౌడీ షీటర్ దాడి

Updated on: Jun 09, 2022 | 10:04 PM

బిగ్ బాస్ విజేత సన్నీ పై దాడి జరిగింది. హస్తినాపురం ప్రాంతంలో ఓ సినిమా షూటింగ్‌లో ఉన్న సన్నీపై ఓ రౌడీ షీటర్ దాడి యత్నించినట్లు తెలుస్తోంది. దీంతో సినిమా షూటింగ్ నుంచి నేరుగా మీర్‌పేట్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు సన్నీ..

బిగ్ బాస్ విజేత సన్నీ పై దాడి జరిగింది. హస్తినాపురం ప్రాంతంలో ఓ సినిమా షూటింగ్‌లో ఉన్న సన్నీపై ఓ రౌడీ షీటర్ దాడి యత్నించినట్లు తెలుస్తోంది. దీంతో సినిమా షూటింగ్ నుంచి నేరుగా మీర్‌పేట్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు సన్నీ.. దాడి చేసిన రౌడీ షీటర్‌పై ఫిర్యాదు చేశాడు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొన్న మీర్‌పేట్ పోలీసులు, రౌడీ షీటర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం వాసి వీజే సన్నీ బిగ్ బాస్ షోతో వెలుగులోకి వచ్చాడు. అంతకు ముందు ఎన్నో షోలు చేసినా.. దక్కిని పాపులారిటీ, బిగ్ బాస్ షోతో ఒక్కసారిగా దరి చేరింది. బిగ్‏బాస్ తెలుగు సీజన్ 5 విన్నర్‌గా నిలిచి, ట్రోఫీ అందుకున్నాడు. దీంతో సన్నీకి వరుసగా సినిమా ఛాన్సులు వస్తున్నాయి. ప్రస్తుతం సన్నీ పలు సినిమాలతో ఎంతో బిజీగా మారిపోయాడు. సన్నీ పై దాడి జరగడంతో అతడి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Namrata Shirodkar: సినిమాల్లో రీ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన నమ్రత..

పేరుకే గ్రామం.. అక్కడ ఒకొక్కరి ఆదాయం నెలకు రూ.80లక్షలు పైనే !!

నాసా అద్భుత వీడియో !! మేఘాల గుండా వెళ్తోన్న గురు గ్రహం !!

Viral Video: పాములే అతడి నేస్తాలు.. నిద్రపోయినా వాటితో కలిసే !!

Published on: Jun 09, 2022 10:04 PM
Loading...
Unable to load recommendations.
Follow Us