Udhayanidhi Stalin: సీఎం కొడుకైనా.. హీరో అయినా.. ఓవర్ యాక్షన్ చేస్తే ఇంతే..!

|

Jun 25, 2023 | 12:42 PM

ఉదయనిధి స్టాలిన్..! స్టార్ హీరో...! దానికి తోడు.. ది గ్రేట్ పొలిటీషియన్ కమ్ రైటర్.. కరుణానిధి గ్రాండ్‌ సన్‌! ప్రజెంట్ తమిళనాడు సీఎం స్టాలిన్.. సన్‌! పైగా యూత్ వెల్‌ఫేర్ అండ్ స్పోర్ట్స్‌ డెవలప్‌మెంట్ ఆప్‌ తమిళ్ నాడు మినిష్టర్. అలాంటి ఉదయనిధి స్టాలిన్ తాజాగా కోర్టు నోటీసులు అందుకున్నారు.

ఉదయనిధి స్టాలిన్..! స్టార్ హీరో…! దానికి తోడు.. ది గ్రేట్ పొలిటీషియన్ కమ్ రైటర్.. కరుణానిధి గ్రాండ్‌ సన్‌! ప్రజెంట్ తమిళనాడు సీఎం స్టాలిన్.. సన్‌! పైగా యూత్ వెల్‌ఫేర్ అండ్ స్పోర్ట్స్‌ డెవలప్‌మెంట్ ఆప్‌ తమిళ్ నాడు మినిష్టర్. అలాంటి ఉదయనిధి స్టాలిన్ తాజాగా కోర్టు నోటీసులు అందుకున్నారు. తన సినిమా చేయకుండా.. సినిమాల నుంచి ఎలా రిటైర్ అవుతావని తనని… ఓ ప్రొడ్యూసర్ నిలదీసే వరకు తెచ్చుకున్నారు. ఎస్ ! నిన్న మొన్నటి వరకు.. వరుస సినిమాలు చేస్తూ.. కోలీవుడ్ స్టార్ హీరోగా గుర్తింపుపొందిన ఉదయనిధి స్టాలిన్… రీసెంట్గా పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. తన తండ్రి సీఎం స్టాలిన్ వెన్నంటే.. ఉంటూ.. అటు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇలాంటి ఈ టైంలో.. సినిమాలు మానేస్తే బెటర్‌ అని ఫీలైన ఉదయనిధి.. తాజాగా తాను చేస్తున్న మామన్నన్ సినిమానే తన లాస్ట్ సినిమా అని అనౌన్స్‌ చేశారు. ఈ సినిమా తర్వాత మరే సినిమా చేయనంటూ చెప్పారు.  దీంతో… ఉదయనిధి స్టాలిన్ తీసుకున్న నిర్ణయం పై కోలీవుడ్ ప్రొడ్యూసర్‌ రామశరవణన్.. తాజాగా కోర్టు మెట్లెక్కారు. ఉదయనిధితో పాటు.. మామన్నన్ మూవీ మేకర్స్ కు కోర్టు నోటీసులు పంపారు. సినిమా రిలీజ్‌ ను ఆపాలని ఆ నోటీసుల్లో కోట్ చేశారు. మామన్నన్ సినిమా ముందు.. తన ప్రొడక్షన్‌లోనే… ఉదయనిధి స్టాలిన్ ఏంజెల్ సినిమాకు కమిట్ అయ్యారని.. 80 శాతం షూటింగ్ పూర్తయ్యాక మామన్నన్ సినిమా షూటింగ్‌ మొదలెట్టారని కోర్టుకు రామశరవణన్ తన పిటిషన్‌లో కోర్టుకు విన్నవించారు. ఆ 80 శాతం షూటింగ్‌కు తనకు 13 కోట్ల మేర ఖర్చు అయిందని.. ఇప్పుడు తన షూటింగ్ పూర్తి చేయడం మానేసి.. సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించడం దారుణం అంటూ.. దాంట్లో రాసుకొచ్చారు. ఉదయనిధిని తక్షణం తన సినిమా షూటింగ్‌కు హాజరుకావాలని ఆదేశించాలని.. అప్పటి వరకు జూన్ 29 రిలీజ్కు రెడీ అయిన మామన్నన్ సినిమాను ఆపాలని కోర్టకు విజ్ఙప్తి చేశారు. ఇక ఈవిషయం కోలీవుడ్ లో బిగ్ ఇష్యూగా మారింది. దాంతో పాటే… ఉదయనిధిపై విమర్శలు వచ్చేలా చేస్తోంది. దానికి తోడు కొంత మంది నెటిజెన్స్‌ ఈ హీరోగాపై సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్నారు. సీఎం తండ్రి కదాని ఓవర్‌ యాక్షన్ చేస్తే ఎవరూ ఊరుకోరంటూ.. వార్నింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఇష్యూను మరింతగా ముదిరేలా చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌..