Rashmika Mandanna: విరోష్‌ గొప్ప మనసు.. ఏకంగా 400 కుటుంబాల దత్తత!

Updated on: Oct 16, 2026 | 4:16 PM

‘రణబాలి’ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా మరోసారి వార్తల్లో నిలిచారు. ‘అన్నపూర్ణ’ కార్యక్రమం ద్వారా 400 కుటుంబాలకు మూడు నెలల పాటు ఆర్థిక సాయం అందించనున్నట్లు రష్మిక ప్రకటించినట్లు సమాచారం. ఈ సహాయం కుటుంబాలకు నిత్యావసరాల ఖర్చులు తగ్గించి, భవిష్యత్తు కోసం పొదుపు చేసుకునేందుకు ఉపయోగపడుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

పెళ్లి తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటిస్తోన్న మొదటి సినిమా రణబాలి. రాయలసీమతో బ్రిటిష్ పాలకులు సాగించిన ఆకృత్యాల నేపథ్యంలో డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ ఈ మూవీని తెరకెక్కించారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న రణబాలి చిత్రం అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లలో బిజి బిజీగా ఉంటున్నారు రష్మిక- విజయ్. ప్రమోషన్స్ ఈవెంట్స్ కోసం దేశమంతా పర్యటిస్తున్నారు. ప్రముఖ ఆలయాలను సందర్శిస్తున్నారు. ఇదిలా ఉంటే రణబాలి రిలీజ్ కు ముందు రష్మిక, విజయ్ దంపతులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ జోడీ లాగే తమ మనసు కూడా చాలా అందమైనదని నిరూపిస్తూ ఏకంగా 400 కుటుంబాలను దత్తత తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ కుటుంబాలకు మూడు నెలల పాటు సాయం చేస్తామని వెల్లడించింది. ఈ మేరకు ‘అన్నపూర్ణ’ పేరుతో చేపట్టే ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది రష్మిక. ‘మీరు పోషించే పాత్రలలో మిమ్మల్ని ప్రభావితం చేసే అంశాలు కొన్ని ఉంటాయి.. మీలో చాలా మంది ‘జయమ్మకి, నాకు మధ్య ఏమైనా పోలికలు ఉన్నాయా?’ అని అడుగుతూ ఉంటారు. దానికి నా వద్ద సమాధానం ఉంది. ఇది ఎల్లప్పుడూ నేనే. మీరు నాపై చూపిస్తున్న ప్రేమకు ప్రతిఫలంగా నేను ఎప్పుడూ ఇలాంటివి చేస్తూనే ఉంటా.. కానీ ఎప్పుడూ ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాలనుకుంటాను. ఎందుకంటే, నాకు, నా బృందానికి, మాలో కొందరికి తెలిస్తే చాలు అనుకున్నా. కానీ ఇప్పుడు నేను దీని గురించి బయటపెడుతున్నా.. ఎందుకంటే ఇది మిమ్మల్ని, నా ప్రియమైన వారిని, ఇలాంటిది ఏదైనా చేయడానికి ప్రభావితం చేయగలిగితే.. నేను చాలా సంతోషిస్తాను. నేను ఈ రోజు 400 కుటుంబాలను దత్తత తీసుకున్నా. ఒక్కో కుటుంబానికి 3 నెలల పాటు సహాయం చేయాలనుకుంటున్నా. రాబోయే ఒక సంవత్సరం పాటు దీనిని కొనసాగిస్తా. వారు ఆ డబ్బును నిత్యావసరాల కోసం ఆదా చేసి, దానిని తమ భవిష్యత్తును మెరుగ్గా ప్రణాళిక చేసుకోవడానికి ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నా. చేసిన సహాయం ఏదీ పెద్దదిగా ఉండాల్సిన అవసరం లేదు. మనమందరం ఏదో ఒక చిన్న విషయంతో ప్రారంభిద్దాం ‘నన్ను నమ్మండి, గత కొన్నేళ్లుగా నేను పడిన నిద్రలేని రాత్రులు, గాయాలు, కష్టాలు, నొప్పి, కన్నీళ్లు, అన్నింటికీ ఈ చిరునవ్వులే ప్రతిఫలం. ఇది వెలకట్టలేనిది’ అని రష్మిక పేర్కొంది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. విరోష్ దంపతులపై సినీ అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హైదరాబాద్‌–విజయవాడ హైవేకు మహర్దశ! ఆరు లైన్ల పనులకు ముహూర్తం ఫిక్స్!

విమానంలో షాకింగ్‌ ఘటన.. ఫ్లైట్‌ అటెండెంట్‌ను కొరికిన నటి

అరటినారతో అద్భుతం సృష్టించిన నేతన్న!

రెస్టారెంట్ల వంటగదుల్లో నిఘా కళ్లు.. అక్కడ వండితే ఇక్కడ కస్టమర్‌కి క్లియర్‌గా కనిపించేలా..

అరె.. ఈ గీతకార్మికుడి ఐడియా అదిరింది.. మోకు లేకుండానే చకచకా చెట్టెక్కేసాడు!

Loading...
Unable to load recommendations.
Follow Us