Ramba Urvasi Menaka Review: చాలా రోజుల తర్వాత అల్లరోడి మార్క్‌ కామెడీ.. నవ్వించాడా? బోర్ కొట్టించాడా?

Updated on: Sep 05, 2026 | 5:34 PM

సీరియస్‌ సినిమాలతో బిజీగా ఉన్న అల్లరి నరేష్‌ చాలా రోజుల తర్వాత తన మార్క్‌ కామెడీతో ‘రంభ ఊర్వశి మేనక’లో ప్రేక్షకుల ముందుకొచ్చారు. దేవకన్యలు భూమిపైకి వస్తే అనే ఫాంటసీ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఫస్టాఫ్‌లో నవ్వులు పంచుతుంది. అల్లరి నరేష్‌, సీనియర్‌ నరేష్‌ కామెడీ సీన్లు ఆకట్టుకుంటాయి. అయితే సెకండాఫ్‌ కాస్త సాగదీయడం, ఎమోషన్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ మిక్స్‌ చేయడంలో తడబాటు సినిమాకు మైనస్‌గా మారాయి. ఓవరాల్‌గా అల్లరోడి కామెడీ కోసం ఓ లుక్‌ వేయొచ్చు.

ఈ మధ్య సీరియస్ సినిమాలు ఎక్కువగా చేస్తున్న అల్లరి నరేష్.. చాలా రోజుల తర్వాత చేసిన తన స్టైల్ ఆఫ్ కామెడీ సినిమా చేశారు. ఆ సినిమా పేరే రంభ ఊర్వశి మేనక. దేవకన్యలు భూమ్మీదకు వస్తే అనే ఫాంటసీ పాయింట్‌తో క్రేజీగా తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉందనేది.. ఇప్పుడీ రివ్యూలో చూద్దాం. విత్ అవుట్ స్పాయిలర్ రంభ, ఊర్వశి మేనక కథలోకి వెళితే.. మంతెన సూర్య నారాయణ అలియాస్ అల్లరి నరేష్‌కు లైఫ్ అంటే పెద్దగా సీరియస్ నెస్ ఉండదు.. చిన్నప్పటి నుంచి తమ పెద్దలు చెప్పిన ఓ మ్యాజిక్ బుక్ చుట్టూనే తిరుగుతుంటాడు. జీవితంపై బాధ్యత లేకుండా ఎప్పుడూ ఆ మాయల పుస్తకం తెరిచి రంభ, ఊర్వశి, మేనకలను భూమి మీదికి రప్పించాలని ప్రయత్నిస్తుంటాడు.వాళ్లు వస్తే తన కోరికలన్నీ తీరిపోయి పెద్ద హీరో అయిపోవచ్చని వాళ్ల బాబాయ్ CEO అలియాస్ నరేష్ వీకే చెప్తాడు. దాంతో 25 ఏళ్లుగా ముగ్గు వేసి మరీ రంభ అలియాస్ రాశి సింగ, ఊర్వశి అలియాస్ విష్ణుప్రియ, మేనక అలియాస్ ప్రిషా సింగ్ కోసమే వేచి చూస్తుంటాడు. అయితే కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో సూరి ముగ్గు ప్రయత్నం ఫలించి ఆ ముగ్గురు దేవకన్యలు భూమిపైకి వస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది. సూర్య జీవితం ఎలాంటి మలుపులు మధ్య ముందుకు సాగింది. ఈ వింత పరిస్థితుల నుంచి మన హీరో ఎలా బయటపడ్డాడు? అన్నదే ఈ సినిమా స్టోరీ. మామూలుగానే ఫాంటసీ స్టోరీలకు ఎక్కువ ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంటుంది. పర్ఫెక్ట్‌గా పిక్చరైజ్‌ చేయాలే కానీ.. కొంచెం అటీటైనా కూడా.. ఆ ఫాంటసీ ఎలిమెంట్సే సినిమాను గట్టెక్కిస్తుంటాయి. ఇక ఇక్కడ రంభ, ఊర్వశి, మేనక విషయానికి వచ్చే సరికి.. అల్లరి నరేష్ నవ్వులు కూడా బోనస్. సగటు ఆడియన్ కూడా ఇదే ఎక్స్‌పెక్టేషన్స్‌తో వస్తాడు. ఆ ఎక్స్‌పెక్టేషన్‌ను డైరెక్టర్ చంద్రమోహన్ చింతాడ మ్యాచ్ చేసేందుకు కష్టపడ్డాడనే చెప్పాలి. ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అల్లరి రోడి కష్టం అండ్ కామెడీ.. ఈ రెండు ఈ సినిమాలో చాలా బాగా కనిపిస్తాయి. కానీ ఆ కామెడీ మూలాన వచ్చే నవ్వులోనే కాస్త గాఢతే తగ్గిందనే చెప్పాలి. అక్కడక్కడ నవ్వులతో ఫస్టాఫ్ బాగుంది. నరేష్ రంభను లైన్లో పెట్టే సీన్స్ అందర్నీ కడుపుబ్బా నవ్విస్తాయి. అయితే సెకండాఫ్‌ కాస్త సాగదీసినట్టు అనిపించడం.. భావోద్వేగాలు, వినోదం కలగలుపుదామనుకున్న ఆలోచన మైనస్ అని చెప్పొచ్చు. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే.. యాజ్ యూజ్‌వల్ అల్లరోడు చాలా బాగా యాక్ట్ చేశాడు. సీఈఓగా చేసిన సీనియర్ నరేష్ తనదైన కామిక్ టైమింగ్‌తో బాగా ఎంటర్‌టైన్ చేశాడు. ముఖ్యంగా ఆయన రంభను లైన్లో పెట్టేందుకు చేసే ప్రయత్నాలు, డైలాగ్స్ కడుపుబ్బా నవ్విస్తాయి. దేవకన్యలుగా చేసిన రాశీ సింగ్, ప్రిషా సింగ్, విష్ణు ప్రియ కేవలం గ్లామర్ షోకే పరిమితం కాకుండా చాలా హుందాగా, అందంగా కనిపించారు. ఇంద్రుడి గెటప్‌లో వెన్నెల కిషోర్, హీరో ఫ్రెండ్ గా శ్రీనివాస్ రెడ్డి తమ కామెడీతో కాస్త రిలీఫ్ ఇచ్చారు. చైతన్ భరద్వాజ్ సంగీతం, RR బాగుంది. రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ.. కొన్ని సీన్స్‌లో ఎఫెక్ట్స్ కూడా బాగానే అనిపిస్తాయి. అంతే ఓకే కానీ.. డైరెక్టర్ చంద్రమోహన్ రాసుకున్న కాన్సెప్ట్‌కు ఇంకాస్త బలమైన స్క్రిప్ట్ తోడై ఉంటే ఇంకా బాగుండేదేమో..! కానీ అల్లరోడి నవ్వులు ఎక్స్‌పీరియన్స్ చేయాలంటే మాత్రం.. ఈ సినిమా వైపు ఓ లుక్కేయొచ్చు..

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

I’m Game Review: సగం గెలిచాడు.. సగంలో ఓడాడు..! హిట్టా..? ఫట్టా..?

Mirzapur Review: మున్నా భయ్యా ఈజ్ బ్యాక్! హిట్టా..? ఫట్టా..?

పాత డీజిల్ వాహనదారులకు శుభవార్త

హైదరాబాద్ – విజయవాడ హైవే ఇక 6 లేన్స్! ట్రాఫిక్ జామ్‌లకు గుడ్‌బై..

ఇక హీరోల హవా తగ్గినట్టేనా? డైరెక్టర్‌ రానా షాకింగ్ కామెంట్స్

Loading...
Unable to load recommendations.
Follow Us