Ramayana: రామాయణ 2… ఆ సెంటిమెంట్లు మిస్ అయ్యాయా?

Edited By:

Updated on: Nov 09, 2026 | 6:13 PM

‘రామాయణ’ తొలి భాగానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుండటంతో ఇప్పుడు సీక్వెల్‌పై ఆసక్తి పెరిగింది. అయితే కథ అందరికీ తెలిసినదే కావడంతో తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠను సృష్టించడం మేకర్స్‌కు సవాల్‌గా మారనుంది. ‘బాహుబలి 2’ తరహా సస్పెన్స్‌ హుక్‌ ఇక్కడ పనిచేయకపోవచ్చు. అలాగే విడుదల మధ్య ఎక్కువ విరామం ఉండటంతో విజువల్‌ గ్రాండియర్‌, భావోద్వేగాల ద్వారానే ప్రేక్షకుల ఆసక్తిని కొనసాగించాల్సి ఉంటుంది.

మోస్ట్ అవెయిటెడ్ విజువల్ వండర్ రామాయణ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. ఈ సినిమాలో గ్రాండ్ విజువల్స్‌, బెస్ట్ ఫెర్ఫామెన్స్‌లకు ఆడియన్స్‌ ఫిదా అవుతున్నారు. తొలి భాగానికి మంచి టాక్ రావటంతో ఇప్పుడు అందరి దృష్టి సీక్వెల్ మీద పడింది. అయితే సీక్వెల్స్ విషయంలో బ్లాక్‌బస్టర్ హిట్స్ సాధించిన ఫార్ములాలు ఈ సినిమా పార్ట్ 2కి ఏమాత్రం వర్కవుట్ అయ్యేలా కనిపించడం లేదు. రామాయణ పార్ట్ 1 మంచి సక్సెస్ సాధించిన… పార్ట్ 2 కోసం ప్రేక్షకులను ఎంగేజ్ చేసే విషయంలో మాత్రం మేకర్స్‌కు పెద్ద సవాల్ ఎదురుకాబోతోంది. ముఖ్యంగా తొలి భాగం క్రేజ్‌ను క్యాష్ చేసుకునే విషయంలో మేకర్స్‌ ఎలాంటి ప్లాన్‌ సిద్ధం చేస్తున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ఫ్రాంచైజీ సినిమాలకు ప్రధాన బలంగా నిలిచే అంశాలు రామాయణ 2కి ప్లస్ అయ్యే అవకాశం కనిపించటం లేదు. బాహుబలి 2 విషయంలో ‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?’ అన్న సింగిల్ హుక్ పాయింట్ సీక్వెల్ కోసం ఆడియన్స్ ఏళ్ల తరబడి వెయిట్ చేసేలా చేసింది. ఆ సస్పెన్స్ సినిమాపై క్యూరియాసిటీని పీక్స్‌లో ఉంచింది. ఆ తరువాత వచ్చిన ‘ధురంధర్’ లాంటి సినిమాల విషయంలో ఫస్ట్ పార్ట్‌కు, సెకండ్ పార్ట్‌కు మధ్య షార్ట్ గ్యాప్ ఉండటం బజ్, క్రేజ్ కంటిన్యూ అవ్వడానికి బాగా కలిసొచ్చింది. కానీ, రామాయణ పార్ట్ 2కు ఈ రెండు ఫార్ములాలు అప్లై అయ్యే ఛాన్స్ లేదు. రామాయణ కథ భారతదేశంలో దాదాపు అందరికీ తెలిసిందే కావడంతో ‘తర్వాత ఏం జరుగుతుంది?’ అనే క్యూరియాసిటీ ఉండదు. దానికి తోడు రిలీజ్ విషయంలోనూ మేకర్స్ చాలా టైమ్ తీసుకుంటున్నారు. కేవలం విజువల్ గ్రాండియర్, ఎమోషనల్ కనెక్టివిటీతోనే మేకర్స్ మ్యాజిక్ చేయాల్సి ఉంది. మరి ఈ విషయంలో మూవీ టీమ్ ప్లానింగ్ ఎలా ఉందో చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రూ.40 కోట్లు ఇస్తేనే ఉంటాం.. స్టార్ ప్లేయర్ల భారీ డిమాండ్

కాశీలో ట్రాఫిక్‌ కష్టాలకు చెక్.. దేశంలోనే తొలి పబ్లిక్‌ రోప్‌వే సిద్ధం

ఆటో ఎక్కితే అంతే సంగతులు.. మహిళలే టార్గెట్

విమానయాన రంగంలో కొత్త శకం.. 90 ఏళ్ల నాటి చట్టం రద్దు

రాపిడో డ్రైవర్‌తో ప్రేమలో పడిన యువతి.. వైరల్ లవ్ స్టోరీ!

Loading...
Unable to load recommendations.
Follow Us