గ్లోబల్‌ బిజినెస్‌ లెక్కలు మార్చేస్తున్న రామాయణ టీమ్‌

Updated on: Aug 19, 2026 | 12:04 PM

రామాయణ సినిమా గ్లోబల్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుంటూ సరికొత్త విడుదల వ్యూహంతో ముందుకు వస్తోంది. నితీష్ తివారీ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం ఇంటర్నేషనల్ బాక్సాఫీస్‌లో నవంబర్ 6న, ఇండియాలో నవంబర్ 8న విడుదల కానుంది. ఐమాక్స్ ఫార్మాట్‌పై ప్రత్యేక దృష్టి సారించి, క్రిస్టోఫర్ నోలన్ ది ఒడిస్సీ (Oppenheimer) తరహాలో బిజినెస్ ప్లాన్‌ను అమలు చేస్తున్నారు.

ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ చిత్రాలు గ్లోబల్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. కేవలం పాన్ ఇండియా స్థాయికి పరిమితం కాకుండా, హాలీవుడ్ సినిమాల మాదిరిగానే బిజినెస్ వ్యూహాలను అనుసరిస్తున్నాయి. ఇటీవల ఇంటర్నేషనల్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన క్రిస్టోఫర్ నోలన్ ది ఒడిస్సీ (Oppenheimer) సినిమా సక్సెస్ ఫార్ములాను ఇప్పుడు రామాయణ చిత్ర నిర్మాతలు అవలంబిస్తున్నారు. నితీష్ తివారీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి జంటగా నటిస్తున్న రామాయణ సినిమా విడుదలను ఇంటర్నేషనల్ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ ఇండియాలో నవంబర్ 8న విడుదలవుతుండగా, గ్లోబల్ ఆడియన్స్‌ను లక్ష్యంగా చేసుకుని నవంబర్ 6నే ఇంటర్నేషనల్ మార్కెట్స్‌లో విడుదల చేయనున్నారు. ఒక భారతీయ సినిమాను ఇలా వెస్ట్రన్ మార్కెట్స్‌లో ముందుగా విడుదల చేయడం ఇదే తొలిసారి. ది ఒడిస్సీ (Oppenheimer) సినిమా ఐమాక్స్ స్క్రీన్లపై బిలియన్ డాలర్ల మార్క్‌ను దాటి, చైనా మార్కెట్‌లోకి ప్రవేశించి ఎలా సంచలనం సృష్టించిందో, రామాయణ కోసం కూడా అదే రూట్‌మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నారు

Loading...
Unable to load recommendations.
Follow Us