Ramayana: పెద్ద రిస్క్ తీసుకుంటున్న ‘రామాయణ’ టీం

Edited By:

Updated on: Aug 15, 2026 | 11:21 PM

రణ్‌బీర్ కపూర్, యశ్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘రామాయణ’ ప్రమోషన్స్‌ కొత్త పంథాలో సాగుతున్నాయి. స్కూళ్ల నుంచి అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌ వరకు వినూత్న ప్రచారం చేసిన మేకర్స్‌ ఇప్పుడు బిగ్‌ సినీ ఎక్స్‌పో 2026పై దృష్టి పెట్టారు. ఆగస్టు 18న జరిగే ఈ ఈవెంట్‌లో సాధారణ ప్రేక్షకులకు ఇంకా చూపించని ప్రత్యేక ఫుటేజ్‌ను ప్రదర్శించనున్నారు. లీకులు జరగకుండా కఠినమైన భద్రతా చర్యలు చేపట్టనున్నారు.

2026 మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో ఒకటైన రామాయణ ప్రమోషన్స్ సరికొత్త పంథాలో జరుగుతున్నాయి.. ట్రైలర్ రిలీజ్‌కు ముందే వెళ్లిన స్కూల్స్ నుంచి నిన్నమొన్నటి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ వరకు చాలా కొత్తగా ప్రమోషన్స్ చేస్తున్నారు మేకర్స్. తాజాగా ప్రమోషన్ కోసం మరో రిస్క్ తీసుకోడానికి రెడీ అయ్యారు మేకర్స్. మరి అదేంటో తెలుసా..? రణ్‌బీర్ కపూర్, యశ్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న రామాయణ సినిమా ప్రమోషన్స్ నెక్స్ట్ లెవల్‌లో జరుగుతున్నాయి. కేవలం ప్రెస్ మీట్‌లకే పరిమితం కాకుండా.. ట్రైలర్ రిలీజ్‌కు ముందే మేకర్స్ స్కూల్స్‌కు వెళ్లి పిల్లలకు రామాయణ ఇతిహాసం గొప్పతనాన్ని వివరించారు. ఆ తర్వాత ఏకంగా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో కూడా పాల్గొన్నారు. ఇలా వినూత్నంగా ప్రమోషన్స్ చేస్తూ అంచనాలు పెంచుతున్న మేకర్స్.. ఇప్పుడు థియేటర్ ఓనర్స్ నిర్వహించే బిగ్ సినీ ఎక్స్‌పో 2026 ఈవెంట్‌పై ఫోకస్ పెట్టారు. ఆగస్ట్ 18న జరగబోయే ఈ ఈవెంట్‌లో రామాయణ సినిమాకు సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ ఫుటేజ్‌ ప్రదర్శించనున్నారు. బయట ప్రపంచానికి చూపించని కీలకమైన విజువల్స్‌ను కేవలం ఈ ఎక్స్‌పోకు వచ్చే ప్రతినిధుల కోసం మాత్రమే ప్లే చేయబోతున్నారు. ఇంకా రిలీజ్ చేయని స్పెషల్ కంటెంట్ కావడంతో.. ఈ వీడియో ఎక్కడా లీక్ కాకుండా నిర్వాహకులు కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎక్స్‌పోలో పాల్గొనే వాళ్లు ఎలాంటి రికార్డింగ్ చేయకుండా చూసుకునేందుకు ప్రత్యేకంగా సెక్యూరిటీని ఏర్పాటు చేస్తున్నారు. కేవలం సినిమా ఇండస్ట్రీ, థియేటర్ల రంగంలోని ప్రముఖులు మాత్రమే ఈ ఎక్స్‌క్లూజివ్ విజువల్స్ చూసే అవకాశం దక్కించుకోనున్నారు. నిజానికి ప్రతి ఏటా జరిగే ఈ బిగ్ సినీ ఎక్స్‌పోలో రాబోయే భారీ సినిమాల ఫుటేజ్‌ను ముందే ప్రదర్శించడం ఆనవాయితీగా వస్తోంది. గతంలో బ్రహ్మాస్త్ర, మైదాన్, బేబీ జాన్ లాంటి క్రేజీ సినిమాలకు సంబంధించిన స్పెషల్ గ్లింప్స్‌ను కూడా ఈ ఈవెంట్‌లో ప్రదర్శించి మెప్పించారు. ఇదే ట్రెండ్ రామాయణ మేకర్స్ ఫాలో అవుతున్నారు. సినిమా దివాళికి విడుదల కానుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భారత్‌కు నాసా పిలుపు.. చందమామపై ఇల్లు కడదామంటూ ఆహ్వానం

పిల్లలకోసం తల్లి సాహసం.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో!

నడిరోడ్డుపై వింత ఆకారం.. బొమ్మ అనుకొని పట్టుకోగా షాక్‌

ఏటా వెయ్యి కోట్ల గుడ్లు వృథా.. భారత్‌పై ఎన్‌ఈసీసీ సంచలన నివేదిక!

10వ తరగతి అర్హతతో రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 734 ఉద్యోగాలు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక!

Loading...
Unable to load recommendations.
Follow Us