బాక్సాఫీస్ దగ్గర రాముడికి కనకాభిషేకం.. తొలిరోజు వసూళ్లెంత?

Updated on: Nov 07, 2026 | 7:18 PM

రణ్‌బీర్‌ కపూర్‌ రాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్‌ రావణుడిగా నటించిన ‘రామాయణ’ తొలి రోజు బాక్సాఫీస్‌ వసూళ్లపై ఆసక్తి నెలకొంది. ట్రేడ్‌ నివేదికల ప్రకారం ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.127 కోట్ల గ్రాస్‌ వసూలు చేసినట్లు సమాచారం. హిందీలో రూ.47.50 కోట్ల నెట్‌ కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తోంది. దాదాపు రూ.2,000 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం లాంగ్‌ రన్‌లో ఎంత వసూలు చేస్తుందో చూడాలి.

నితీష్‌ తివారీ డైరెక్షన్లో.. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన రామాయణ.. ఎన్నో అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చింది. థియేటర్లలోకి రావడమే కాదు.. అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. రాముడిగా రణ్‌ బీర్ కపూర్ చాలా మెచ్చ్యూర్డ్‌ యాక్ట్ చేస్తూ.. వేరియేషన్స్ చూపించారని.. సీతగా సాయి పల్లవి.. డీసెంట్‌గా యాక్ట్ చేశారని.. రావణుడిగా యశ్‌ తన హావభావాలతో వెన్నులో వణుకుపుట్టిస్తున్నారని అందరూ చెబుతున్నారు. వీరి యాక్టింగ్‌కి తోడు.. వీఎఫ్‌ఎక్స్ వర్క్‌.. కెమెరాపనితనం.. విజువల్ స్టోరీ బోర్డ్ టాప్‌ నాచ్‌గా ఉందని అందరూ రివ్యూలిస్తున్నారు. దీంతో ఈ మూవీ డే1 వసూళ్ల పై అందరి ఫోకస్ పడింది. అసలు రామాయణ మూవీకి డే1 ఎన్ని కోట్ల కలెక్షన్స్ వచ్చాయంటూ అందరూ నెట్టింట ఆరా తీస్తున్నారు. ఇక అకార్డింగ్ టూ రిపోర్ట్స్ … రామాయణ ఫస్ట్ పార్ట్ ఫస్ట్ డే.. వరల్డ్ వైడ్ దాదాపు రూ.127 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసినట్టు తెలుస్తోంది. ఒక్క హిందీలోనే రూ.47.50 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. కన్నడ నుంచి రూ.7.25 కోట్లు, తెలుగులో రూ.6 కోట్లు, తమిళంలో రూ.2.60 కోట్లు, మలయాళ నుంచి రూ.1.50 కోట్లు వసూళ్లు సాధించినట్లు సమాచారం. టాక్ పాజిటివ్‌గా రావడం.. దానికి తోడు ఈ వీకెండ్ దీపావళి ఉంది కాబట్టి వసూళ్లు మరింత పెరిగే అవకాశమైతే ఉంది. కాకపోతే ఈ చిత్ర బడ్జెట్ రూ.2000 కోట్లు అని నిర్మాతలు చెప్పుకొన్నారు. బ్రేక్ ఈవెన్ రావాలంటే అంతకు మించిన వసూళ్లు రావాలి. లాంగ్ రన్‌లో ఎన్ని వందల కోట్లు రాబడుతుందో చూడాలి..!

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తెరపై నటులు.. కానీ నిజ జీవితంలో దొంగలు

కీరవాణి ఇంట పెళ్లి సందడి షురూ.. శుభకార్యం వచ్చే నెలలోనే..

నాకు తెలిసిన అతను స్వార్థపరుడు.. ముఖేష్‌ ఆటపై జగతి షాకింగ్ రివ్యూ..

సౌత్ హీరోయిన్లు అంటే చిన్నచూపా.. మీరేమన్నా తోపులా..

ఆ స్టార్‌ హీరో చేసిన చెడ్డ అలవాటు.. ఈ నటుడినే బలితీసుకుంది!

Loading...
Unable to load recommendations.
Follow Us