Peddi: ‘పెద్ది’ ప్లాన్ మామూలుగా లేదుగా
రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా విడుదలకు ముందు మేకర్స్ భారీ ప్రమోషన్స్‌కు సిద్ధమయ్యారు. మే 18న ముంబైలో ట్రైలర్ లాంచ్, మే 23న భూపాల్‌లో ఏఆర్ రెహ్మాన్ లైవ్ షోతో ప్రత్యేక ఈవెంట్, జూన్ 2న హైదరాబాద్‌లో గ్రాండ్ ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించనున్నారు. పవన్ కళ్యాణ్, చిరంజీవి కూడా ఈ ఈవెంట్‌కు హాజరయ్యే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది. విడుదలకు ముందు వరుస ఈవెంట్స్‌తో సినిమాపై హైప్ పెంచేందుకు పెద్ది టీమ్ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది.
ఓ వైపు థియేటర్లు, టికెట్ రేట్లు అంటూ చాలా పెద్ద సమస్యలే ఇండస్ట్రీని షేక్ చేస్తున్న సమయంలోనే పెద్ది వస్తున్నాడు. బయట పరిస్థితులు ఎలా ఉన్నా.. మన వంతు ప్రయత్నమైతే గట్టిగా చేయాలిగా అంటున్నారు రామ్ చరణ్. అందుకే పెద్ది ప్రమోషన్స్ కోసం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసారు. 15 రోజుల గ్యాప్‌లో 3 భారీ ఈవెంట్స్ చేస్తున్నారు. మరి వాటి డీటైల్స్ ఏంటి..? పెద్ది ప్రమోషనల్ డోస్ పెంచేస్తున్నారు మేకర్స్. జూన్ 4న సినిమా విడుదల కానుంది. అంటే ఇంకా 20 రోజులే ఉంది. ఆలోపే మూడు భారీ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మొదటి ఈవెంట్ మే 18న ముంబైలో జరగనుంది. అక్కడే ట్రైలర్ లాంఛ్ చేయబోతున్నారు మేకర్స్. నార్త్ మార్కెట్ కోసం పావులు కదుపుతున్నారు పెద్ది మేకర్స్. సౌత్ కంటే ముందు నార్త్‌పైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు పెద్ది. మే 18న ముంబై ఈవెంట్ తర్వాత.. 23న భూపాల్ వెళ్ళబోతున్నారు. అక్కడ మరో ఈవెంట్ ప్లాన్ చేసారు. పైగా ఏఆర్ రెహ్మాన్ లైవ్ షో ఈ ఈవెంట్‌కు మేజర్ హైలైట్ కానుంది. ఇప్పటికే భూపాల్ ఈవెంట్‌పై అఫీషియల్ ప్రోమో కూడా విడుదల చేసింది పెద్ది టీం. 5 రోజుల గ్యాప్‌లోనే ఇటు ముంబై.. అటు భూపాల్ లాంటి పెద్ద నగరాల్లో భారీ ఈవెంట్స్ చేస్తూ సినిమాపై హైప్ అమాంతం పెంచేస్తున్నారు పెద్ది టీం. మరి సౌత్ పరిస్థితేంటి అనుకోవచ్చు.. ఇక్కడా ప్లాన్స్ ఉన్నాయి. జూన్ 2న హైదరాబాద్‌లో భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుందని తెలుస్తుంది. ఎల్బీ స్టేడియంలో దీన్ని ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్‌లో జరగబోయే ఈవెంట్‌కు పవన్ కళ్యాణ్, చిరంజీవి కూడా రానున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆలోపే కుదిర్తే ఏపీలో కూడా ఈవెంట్ చేయాలని చూస్తున్నారు మేకర్స్. మొత్తానికి రాబోయే 20 రోజులు పెద్ది టీమ్ నుంచి వరస సర్‌ప్రైజులు రానున్నాయి. జూన్ 3 సాయంత్రం నుంచే ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
CM Vijay: 0277′ విజయ్ కారు నెంబర్ వెనుక గుండెలు పిండేసే కథ
స్విమ్మింగ్ కు వెళుతున్నారా.. పూల్ కండ్లకలకతో జాగ్రత్త
Khammam: అనాథ కుక్కపిల్లకు తల్లిగా మారిన కోతి.. వైరల్ అవుతున్న వీడియో