Ram Charan: గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌ కోసం రాయల్ లుక్‌లో చరణ్..! చెర్రీ చరిష్మా వేరే లెవల్ అంతే..!

|

Jan 04, 2023 | 7:02 PM

స్టైలింగ్‌లోనూ... తన ట్రెండీ లుక్‌ తోనూ ఎప్పుడూ నెట్టింట హాట్ టాపిక్గా మారే రామ్ చరణ్. మరో సారి తన టేస్ట్ ఆఫ్ స్టైల్‌ తో నెట్టింట ట్రెండ్ అవుతున్నారు. క్లాసీ బ్లాక్ కలర్ సూట్తో..


స్టైలింగ్‌లోనూ… తన ట్రెండీ లుక్‌ తోనూ ఎప్పుడూ నెట్టింట హాట్ టాపిక్గా మారే రామ్ చరణ్. మరో సారి తన టేస్ట్ ఆఫ్ స్టైల్‌ తో నెట్టింట ట్రెండ్ అవుతున్నారు. క్లాసీ బ్లాక్ కలర్ సూట్తో.. మ్యాన్లీ లుక్‌తో అందర్నీ మెస్మరైజ్ చేస్తున్నారు. మరో సారి యూత్ అందరూ తనను ఫాలో అయ్యేలా చేసుకుంటున్నారు.ఎస్ ! తన ప్రతీ లుక్స్‌తో కెరీర్ బెస్ట్ లుక్స్‌గా… అప్రిషియేషన్ అందుకునే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌.. మరో సారి అలాంటి కెరీర్‌ బెస్ట్ లుక్‌లోనే అందర్నీ కనివిందు చేస్తున్నారు. అయితే ఈ ఎందుకంటే.. లాస్‌ ఏంజిల్స్‌లో జరగనున్న గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ కోసం.ఎస్ ! జక్కన్న మాగ్నమ్ ఓపెస్ ట్రిపుల్ ఆర్ సినిమా నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్‌ ఫిల్మ్ కేటెగిరీలో జనవరి 11న లాస్ ఏంజిల్స్‌లో జరిగే గోల్డెన్ గ్లోబ్ అవార్డుకు నామినేట్ అయింది. అలాగే బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌ కేటగిరీలో నాటు నాటు సాంగ్ కూడా నామినేట్ అయింది. ఇక ఈ అవార్డ్స్‌ వెళ్లేందుకే చెర్రీ ఈ రాయల్ లుక్‌ను సెట్ చేసుకున్నారు. ఇక ఇదే విషయాన్ని తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌తో షేర్ చేసుకున్నారు. అయితే చెర్రీతో పాటు తారక్‌ కూడా ఈ అవార్డ్స్‌ సెర్మనీకి వెళుతున్నప్పటికీ.. ఆయన లుక్స్‌ మాత్రం ఇంకా బయటికి రాలేదు. వస్తే.. తనేలా ఉంటారో చూడాలి మరి!

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Crocodile-drone: అబ్భాబ్భా ఎం వీడియో గురు.. తనను క్యాప్చర్‌ చేస్తున్న డ్రోన్‌ను మొసలి ఏం చేసిందో చూస్తే..

School childrens: స్కూల్‌ పిల్లల్లోకి ఆత్మలు.. తాంత్రికుడిని పిలిచి పూజలు నిర్వహణ.. ఎవరో తెలిస్తే షాకే.!

Car accident: డ్రైవర్‌ ర్యాష్‌ డ్రైవింగ్‌.. ప్రశ్నించినందుకు కారుతో ఢీకొట్టి.. నడిరోడ్డుపై దారుణంగా.. వీడియో.

Published on: Jan 04, 2023 07:00 PM