Ram Charan: రామ్‌ చరణ్‌ కోసం 105 కోట్ల డీల్ ఆఫర్ చేసిన ప్రముఖ ఓటీటీ..

|

Mar 22, 2024 | 11:10 AM

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్. షూటింగ్ పూర్తి కాకుండానే ఈ సినిమా OTT ప్రసార హక్కులు అమ్ముడుపోయాయి. ఈ సినిమా OTT ప్రసార హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్‌ అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని అమెజాన్ ఓటీటీనే స్వయంగా వెల్లడించింది. అయితే ఇందుకోసం రికార్డు స్థాయిలో ఏకంగా 105 కోట్లకు డీల్ కుదిరినట్లు సమాచారం.

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్. షూటింగ్ పూర్తి కాకుండానే ఈ సినిమా OTT ప్రసార హక్కులు అమ్ముడుపోయాయి. ఈ సినిమా OTT ప్రసార హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్‌ అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని అమెజాన్ ఓటీటీనే స్వయంగా వెల్లడించింది. అయితే ఇందుకోసం రికార్డు స్థాయిలో ఏకంగా 105 కోట్లకు డీల్ కుదిరినట్లు సమాచారం. ప్రస్తుతం OTT కంపెనీల మధ్య విపరీతమైన పోటీ ఉంది. కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు సొంతం చేసుకోవడానికి ఈ కంపెనీలు పోటీ పడుతున్నాయి. అందులో భాగంగానే అమెజాన్ ప్రైమ్ వీడియోముందుగానే గేమ్ ఛేంజర్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. థియేటర్లలో విడుదలైన కొన్ని నెలల తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియో గేమ్ ఛేంజర్ ఓటీటీ రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించనుంది.

ఇక గేమ్ ఛేంజర్ సినిమాను సౌతిండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. రామ్ చరణ్ తో శంకర్ జత కట్టడంతో ఈ సినిమాపై అభిమానుల అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ అందాల తార కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. ఎన్నికలు, రాజకీయాల నేపథ్యంలో ఈ సినిమా కథ ఉంటుందని టాక్. ఇందులో రామ్ చరణ్ ఐఏఎస్ అధికారిగా నటిస్తున్నాడని ఇటీవల రిలీజైన పోస్టర్లు చెప్పకనే చెప్పేశాయి. అలాగే గేమ్ ఛేంజర్ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్న విషయం కూడా లీకై అందరికీ తెలిసిపోయింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..

Follow us on