Rajinikanth Emotional: కూతురి ఎమోషనల్ స్పీచ్.! అందరి ముందే కన్నీళ్లు పెట్టుకున్న రజినీ.
ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వం వహించిన లేటేస్ట్ సినిమా లాల్ సలామ్. క్రికెట్ గేమ్ ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కీలకపాత్ర పోషించారు. ఈ సినిమాలో సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రత్యేక పాత్ర పోషించారు. చాలా కాలం తర్వాత తన కూతురు డైరెక్షన్ చేసిన ఈ సినిమాలో రజినీ అతిథి పాత్రలో కనిపించారు. ఈ సినిమా ఫిబ్రవరి 9న విడుదల కానుంది. ఈ క్రమంలో చెన్నైలో తాజాగా జరిగిన ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో ఐశ్వర్య షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వం వహించిన లేటేస్ట్ సినిమా లాల్ సలామ్. క్రికెట్ గేమ్ ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కీలకపాత్ర పోషించారు. ఈ సినిమాలో సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రత్యేక పాత్ర పోషించారు. చాలా కాలం తర్వాత తన కూతురు డైరెక్షన్ చేసిన ఈ సినిమాలో రజినీ అతిథి పాత్రలో కనిపించారు. ఈ సినిమా ఫిబ్రవరి 9న విడుదల కానుంది. ఈ క్రమంలో చెన్నైలో తాజాగా జరిగిన ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో ఐశ్వర్య షాకింగ్ కామెంట్స్ చేశారు. తన తండ్రిని విమర్శిస్తున్న వారిపై ఫైర్ అయ్యారు. తన మాటలతో… నాన్న రజినీనే ఏకంగా కన్నీళ్లు పెట్టించారు.
ఇంతకీ ఐశ్యర్వ ఏం అంతలా ఏం మాట్లాడారంటే…! “సోషల్ మీడియాకు నేను చాలా దూరంగా ఉంటాను. ఆన్ లైన్ నెగిటివిటీ గురించి నా టీమ్ తరచూ చెబుతుంటుంది. వాటి వల్ల నేను చాలా సందర్భాల్లో ఆగ్రహానికి గురయ్యాను. మేము మనుషులమే. మాకు భావోద్వేగాలు ఉంటాయి. ఈ మధ్యకాలంలో నా తండ్రిని ‘సంఘీ’ అని పిలుస్తున్నారు. ఏదైనా రాజకీయ పార్టీకి మద్దతు ఇచ్చేవారిని అలా పిలుస్తారని తెలుసుకున్నాను. రజినీకాంత్ సంఘీ కాదు. అలా అయితే ఆయన లాల్ సలామ్ సినిమాలో నటించేవారు కాదు. ఒక మానవతావాది మాత్రమే ఈ సినిమాలో నటించగలరు. ఆ ధైర్యం నాన్నకు మాత్రమే ఉందని గర్వంగా చెబుతున్నాను ” అని ఎమోషనల్ గా మాట్లాడరు ఐశ్వర్య. అయితే ఐశ్వర్య మాటలు వింటూ.. సూపర్ స్టార్ రజినీ కాంత్ ఒక్క సారిగా… భావోద్వేగానికి లోనయ్యారు. కూతురు మాటలకు కన్నీళ్లు పెట్టుకున్నారు. తన ఫ్యాన్స్‌ను కూడా… కన్నీళ్లు పెట్టుకునే చేశారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos