Varanasi: ఊపిరి పీల్చుకున్న రాజమౌళి.. వారణాసికి లైన్‌ క్లియర్‌

Edited By:

Updated on: Jul 25, 2026 | 7:45 AM

మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'వారణాసి' చిత్రానికి టైటిల్ విషయంలో ఎదురైన అడ్డంకి తొలగింది. ఇప్పటికే ఆ పేరును రిజిస్టర్ చేసుకున్న దర్శకుడు సుబ్బారెడ్డి, ఎలాంటి షరతులు లేకుండా టైటిల్‌ను జక్కన్న టీమ్‌కు అప్పగించారు. దీంతో అన్ని భాషల్లోనూ 'వారణాసి' పేరుతోనే సినిమా విడుదలకు మార్గం సుగమమైంది. ఈ పరిణామం ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చకు దారితీసింది.

తెలుగు సినిమా స్థాయిని ఒక్కో మెట్టు ఎక్కిస్తూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన దర్శకుడు రాజమౌళి. ఆయన సినిమా అంటే పక్కా ప్లానింగ్ ఉంటుంది కాబట్టే ఎలాంటి వివాదాలు, ఇబ్బందులు వచ్చే ప్రసక్తే లేదు. కానీ సూపర్ స్టార్ మహేష్‌ బాబుతో తీస్తున్న ప్రతిష్టాత్మక సినిమా విషయంలో మాత్రం తొలిసారి జక్కన్నకు ఇబ్బంది ఎదురైంది. అసలు ఏంటా ప్రాబ్లమ్, ఆ ఫస్ట్ హర్డిల్‌ను మన దర్శక ధీరుడు ఎలా క్రాస్ చేశారు..? మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో గ్లోబల్ అడ్వెంచర్ మూవీగా రూపొందుతున్న ప్రాజెక్ట్‌ మీద అదే స్థాయిలో అంచనాలు ఉన్నాయి. అందుకే ఈ సినిమాకు యూనివర్సల్‌ అప్పీల్ ఉండేలా ‘వారణాసి’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు మేకర్స్‌. కానీ అక్కడే సమస్య ఎదురైంది. ఈ మూవీ టైటిల్ విషయంలో జక్కన్నకు ఊహించని షాక్ తగిలింది. వారణాసి టైటిల్‌ను దర్శకుడు సుబ్బారెడ్డి ముందే రిజిస్టర్ చేసుకోవడంతో తెలుగులో అదే పేరుతో సినిమా రిలీజ్ చేసేందుకు ఇబ్బందులు ఎదురయ్యాయి. తెలుగులో వారణాసి టైటిల్‌ పెట్టే ఛాన్స్ లేకపోవటంతో ‘రాజమౌళి వారణాసి’ అని, ఇతర భాషల్లో ‘వారణాసి’ అని రిజిస్టర్ చేసి రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యింది జక్కన్న టీమ్. రాజమౌళి లాంటి టాప్ డైరెక్టర్‌కు ఇలాంటి టైటిల్ ఇష్యూ రావడం, దానికి వేరే ఆప్షన్స్ వెతుక్కోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. జక్కన్న లాంటి గ్రేట్ డైరెక్టర్‌కు తన టైటిల్‌ కావాల్సి రావటంతో ఎలాంటి కండిషన్స్ లేకుండా ‘వారణాసి’ టైటిల్‌ను జక్కన్న టీమ్‌కు ఇచ్చేశారు సుబ్బారెడ్డి. మహేష్, రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్‌ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా మరింత పెంచుతుందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. దీంతో జక్కన్నకు ఎదురైన ఫస్ట్ హర్డిల్ ఈజీగా క్లియర్ అయింది. ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేకుండా ఈ మూవీ అన్ని భాషల్లోనూ ‘వారణాసి’ టైటిల్‌తోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యారా.. ఈ 5 లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి!

భారతీయులకు నిద్ర కరవు.. షాకింగ్ నిజాలు!

మనుషులను చల్లబరిచే ఫ్రిజ్‌.. లోపల 5 నిమిషాలు కూర్చుంటే చాలు

40 అడుగుల ఎత్తు నుంచి పడ్డ టూరిస్ట్! ఏం జరిగిందో మీరే చూడండి!

Tirumala: అన్నప్రసాదాల పంపిణీకి కొత్త టెక్నాలజీ టీటీడీ వినూత్న ప్రయోగం

Follow Us