రాజకీయాల్లోకి రాఘవ లారెన్స్.. క్లారిటీ ఇచ్చిన నటుడు!

Updated on: Jun 08, 2026 | 3:04 PM

కొరియోగ్రాఫర్, నటుడు రాఘవ లారెన్స్ రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారన్న ప్రచారం తమిళనాడులో జోరుగా సాగుతోంది. టీవీకే పార్టీ తరఫున తిరుచ్చి ఈస్ట్ ఉప ఎన్నికలో పోటీ చేస్తారన్న వార్తలపై స్పందించిన లారెన్స్, జూన్ 11న ఉదయం 9:30 గంటలకు తన జీవితానికి సంబంధించిన అత్యంత కీలక ప్రకటన చేస్తానని వెల్లడించారు. దీంతో ఆయన రాజకీయాల్లోకి వస్తారా అనే ఉత్కంఠ నెలకొంది.

ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ త్వరలోనే రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నట్లు తమిళనాడు పొలిటికల్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ తరఫున ‘తిరుచ్చి ఈస్ట్’ నియోజకవర్గ ఉప ఎన్నికలో లారెన్స్ బరిలోకి దిగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ రెండు స్థానాల్లో గెలిచి, తిరుచ్చి ఈస్ట్ స్థానాన్ని వదులుకోవడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. తాజాగా తన పొలిటికల్ ఎంట్రీ వార్తలపై రాఘవ లారెన్స్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన..”నేను తిరుచ్చి ఈస్ట్ నుంచి పోటీ చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై క్లారిటీ ఇవ్వాలని మీడియా మిత్రులు ఫోన్లు చేస్తున్నారు. ప్రస్తుతం నేను ‘బెంజ్’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాను. జూన్ 10తో ఈ షెడ్యూల్ పూర్తవుతుంది. ఆ తర్వాత, మా అమ్మ ఆశీస్సులతో నా జీవితానికి సంబంధించిన ఒక అత్యంత ముఖ్యమైన విషయాన్ని జూన్‌ 11 గురువారం ఉదయం 9:30 గంటలకు ప్రకటిస్తాను” అని లారెన్స్ పేర్కొన్నారు. సినిమాలతో పాటు తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనాథలు, వృద్ధులకు నిత్యం అండగా ఉంటూ రియల్ హీరో అనిపించుకున్న లారెన్స్, తనకు ఎంతో ఇష్టమైన గురువారం రోజున ఎలాంటి ప్రకటన చేయబోతున్నారనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఆయన నిజంగానే రాజకీయాల్లోకి వస్తున్నారా, లేక కొత్త సేవా కార్యక్రమాన్ని ప్రకటిస్తారా అనేది తెలియాలంటే గురువారం వరకు ఆగాల్సిందే!

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కన్నవారిని గెంటేసిన కొడుకు.. చివరిలో సూపర్‌ ట్విస్ట్‌

కేంద్ర ప్రభుత్వ కొత్త పథకం.. 300 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ!

షాకింగ్‌ న్యూస్‌.. మళ్ళీ పెరిగిన వంటగ్యాస్‌ ధర.. ఎంతంటే?

కన్నతల్లి మరణం తట్టుకోలేక..కుప్పకూలిన కుమార్తె!

కస్టమర్లను ముంచేసిన గోల్డ్‌ అప్రైజర్‌.. రూ.40 లక్షల బంగారంతో పరార్‌

Follow Us