Jaali Reddy: జాలి రెడ్డి పెళ్లి కొడుకయ్యాడు.! ఫోటోలు మామూలుగా లేవుగా..

|

Nov 04, 2024 | 10:15 AM

పుష్ఫ ఫేమ్ డాలీ ధనంజయ దీపావళి పండగ రోజున శుభవార్త చెప్పాడు. త్వరలోనే తాను పెళ్లి చేసుకోనున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. అంతేకాదు తనకు కాబోయే భాగస్వామిని కూడా పరిచయం చేశాడీ హ్యాండ్సమ్ హీరో. తన కాబోయే భార్యతో కలిసి ఓ అందమైన వీడియోను షేర్ చేశాడు.

ప్రస్తుతం ధనుంజయ్ పోస్ట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ధనుంజయ్ కు ముందుస్తు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నారు. ఇక ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ధనంజయ్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి సినిమా ఇండస్ట్రీకి చెందినది కాదు. డాలీ పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి పేరు ధన్యత. డాలీ, ధన్యత ఒకరికొకరు చాలా సంవత్సరాలుగా తెలుసు. వీరిద్దరూ మైసూర్‌లో చదువుకున్నారు. ఈ పరిచయం కాస్తా ప్రేమగా చిగురించింది. ఇప్పుడు తమ ప్రేమ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నారీ లవ్ బర్డ్స్. అంతేకాదు వచ్చే ఏడాది ఫిబ్రవరి 16న మైసూర్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో డాలీ, ధన్యత వివాహం జరగనుంది. సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ వివాహ వేడుకకు హాజరుకానున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.