Deepika Padukone: కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! నెట్టింట వీడియో వైరల్.

|

Apr 19, 2024 | 12:22 PM

నటీ నటులు సినిమాల కోసం ఏదైనా చేస్తారు..నటనకు ప్రాధాన్యత ఇస్తూ ఎలాంటి పాత్రలైనా పోషిస్తారు. ఇటీవలే ఆడు జీవితం సినిమా కోసం పృథ్వీరాజ్ సుకుమారన్ 16 ఏళ్లు కష్టపడ్డారు. అలాగే శరీరంలో ఎన్నో మార్పులు చేసుకున్నారు. చియాన్ విక్రమ్ కూడా 'ఐ' సినిమా కోసం బరువు తగ్గి కనిపించారు. ఇలా చాలా మంది పాత్రల కోసం చాలా కష్టపడుతూ ఉంటారు. కేవలం హీరోలు మాత్రమే కాదు హీరోయిన్స్ కూడా అంతే ..

నటీ నటులు సినిమాల కోసం ఏదైనా చేస్తారు..నటనకు ప్రాధాన్యత ఇస్తూ ఎలాంటి పాత్రలైనా పోషిస్తారు. ఇటీవలే ఆడు జీవితం సినిమా కోసం పృథ్వీరాజ్ సుకుమారన్ 16 ఏళ్లు కష్టపడ్డారు. అలాగే శరీరంలో ఎన్నో మార్పులు చేసుకున్నారు. చియాన్ విక్రమ్ కూడా ‘ఐ’ సినిమా కోసం బరువు తగ్గి కనిపించారు. ఇలా చాలా మంది పాత్రల కోసం చాలా కష్టపడుతూ ఉంటారు. కేవలం హీరోలు మాత్రమే కాదు హీరోయిన్స్ కూడా అంతే .. విమర్శలు వస్తాయని తెలిసినా సినిమా కోసం ఎలాంటి పాత్రలైనా చేస్తుంటారు కొంత మంది హీరోయిన్లు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే ఏకంగా కడుపులో బిడ్డతో షూటింగ్ లో పాల్గొన్నారు. అందర్నీ షాక్ అయ్యేలా చేశారు. చాలా మంది హీరోయిన్స్ బేబీ బంప్స్ తో రకరకాల ఫోటో షూట్స్ చేస్తూ.. తమ ఆనందాన్ని అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉంటారు. కానీ దీపిక మాత్రం సినిమా పట్ల తనకు ఉన్న ప్రేమ.. నిర్మాతలకు ఇచ్చిన డేట్స్ కోసం బేబీ బంప్ తో షూటింగ్ లో పాల్గొంటున్నారు. తను కమిట్ అయిన సినిమాలను తొందరగా ఫినిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక రీసెంట్‌గానే తాను తల్లి కాబోతున్న విషయాన్ని అందరితో పంచుకున్నారు దీపిక. దీంతో ఈ బ్యూటీ సినిమాలకు కొన్ని నెలలు పులిస్టాప్ పెడుతుందనే అందరూ అనుకున్నారు. కానీ అలా కాకుండా సినిమా షూటింగ్స్‌లో పాల్గొంటూ.. బీ టౌన్ లో హాట్ టాపిక్ అవుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!