Prathyusha Case: 24ఏళ్ల తర్వాత బయటికొచ్చి.. కోర్టులో లొంగిపోయిన సిద్ధార్థ్‌ రెడ్డి

Updated on: Mar 18, 2026 | 7:40 PM

ప్రత్యూష కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలతో నిందితుడు సిద్ధార్థ్ రెడ్డి 24 ఏళ్ల తర్వాత నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు. ప్రత్యూష ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు అతడికి శిక్ష ఖరారైంది. ప్రత్యూష తల్లి సరోజిని సుదీర్ఘ న్యాయపోరాటం చేసింది, ఆస్పత్రిలో జరిగిన అన్యాయాలు, బెదిరింపులు ఎదుర్కొన్నట్లు ఆమె వెల్లడించింది. ఇది న్యాయానికి దక్కిన విజయం.

ప్రత్యూష కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలతో నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు నిందితుడు సిద్ధార్ధ్‌రెడ్డి. ఇన్నేళ్లుగా అమెరికాలో స్థిరపడిన సిద్ధార్థ్‌ రెడ్డి.. 24 ఏళ్ల తర్వాత టీవీ9 కెమెరాకు చిక్కాడు. 2002 ఫిబ్రవరి 23న కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకుని తాగారు సిద్ధార్థ రెడ్డి, ప్రత్యూష. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రత్యూష మృతి చెందగా..సిద్ధార్థ్ రెడ్డి కోలుకున్నాడు. అయితే ప్రత్యూషది ఆత్మహత్య కాదు హత్యేనంటూ ఆమె తల్లి న్యాయపోరాటం చేశారు. ఈ క్రమంలోనే ప్రత్యూష ఆత్మహత్యకు ప్రేరేపించిన అభియోగాలపై ట్రయల్ కోర్టు సిద్ధార్థ్‌రెడ్డికి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే ఆ తర్వాత శిక్షాకాలాన్ని రెండేళ్లకు తగ్గించింది హైకోర్టు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంని ఆశ్రయించాడు సిద్ధార్థ్‌. హైకోర్టు తీర్పును సమర్థిస్తూ తీర్పు ఇచ్చింది సుప్రీం. ప్రత్యూష ఆత్మహత్యకు సిద్ధార్థ్ రెడ్డి ప్రేరేపించినట్లుగా నిర్ధారించిన కోర్టు.. నాలుగు వారాల్లో లొంగిపోవాలని ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. దాంతో ఈ రోజు కోర్టులో లొంగిపోయాడు సిద్ధార్ద్ రెడ్డి.. ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు అనంతరం టీవీ9తో మాట్లాడారు ప్రత్యూష తల్లి సరోజిని. ఆ రోజు ఆస్పత్రిలోనే చాలా అన్యాయం జరిగిందన్నారు ప్రత్యూష తల్లి.. ఫిబ్రవరి 23న వెళ్లి చూసేసరికి ఆమె గొంతుపై గాట్లు కనిపించాయన్నారు. ఆమె దుస్తులను కూడా ఆస్పత్రి వారు కాల్చేయడం షాకింగ్‌ అన్నారు సరోజిని. ప్రత్యూష చనిపోయిన సమయంలో తనకు చాలా బెదిరింపులు వచ్చాయన్నారు ఆమె తల్లి. వారిద్దరు ప్రేమించుకున్న సమయంలో సిద్ధార్థను నమ్మానని.. అయితే అతడి మెంటాలిటీ ఇంత క్రూయల్‌ అనుకోలేదన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పైరసీపై సరికొత్త గూగ్లీ.. సినీ పరిశ్రమకు కొత్త భద్రత

Jabardasth Appa Rao: జుట్టుకు రంగేసుకుంటే.. ముఖం మాడిపోయింది! అప్పారావు శాడ్ స్టోరీ

తెలంగాణ వాహనదారులకు గుడ్ న్యూస్.. 2% పన్ను రద్దు

కమర్షియల్ గ్యాస్ రూ. 6,500.. డొమెస్టిక్ రూ.3,500.. పెరిగిన బ్లాక్‌ మార్కెట్‌ దందా

దర్జాగా రోడ్డు దాటిన పులి.. నిలిచిపోయిన వాహనాలు..

Follow Us