Prabhas: ప్రభాస్‌ ఫోకస్‌ పెంచాల్సిన టైమ్‌ వచ్చేసినట్టేనా ??

Edited By:

Updated on: Mar 30, 2026 | 7:24 PM

ఇటీవల ఫ్లాపులతో ప్రభాస్ కెరీర్ గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. 'రాజా సాబ్' నిరాశ తర్వాత, 'ఫౌజీ', 'స్పిరిట్', 'కల్కి 2' వంటి తదుపరి చిత్రాలపైనే అభిమానుల ఆశలన్నీ. ప్రశాంత్ నీల్ వంటి దర్శకులు ప్రభాస్‌ను తిరిగి ట్రాక్‌లోకి తీసుకురాగలరని భావిస్తున్నారు. తక్షణమే ఒక పెద్ద హిట్ అవసరం అని రెబల్ స్టార్ సైన్యం కోరుకుంటోంది.

హిట్‌ వచ్చిన తర్వాత కాలర్‌ ఎగరేస్తూ బయట కనిపించడం వేరు. ఫ్లాప్‌ వచ్చినప్పుడు కవర్‌ చేసుకుంటూ, కవర్‌ చేస్తూ కనిపించడం వేరు. ఆ ఫ్లాప్‌ తర్వాత అర్జంటుగా మరో హిట్‌ వస్తేగానీ, ఆ డ్యామేజ్‌ కంట్రోల్‌ కాదు. ఈ విషయం గురించి డార్లింగ్‌ కూడా ఆలోచిస్తున్నారా? కమాన్‌ లెట్స్ వాచ్‌… ఊరించిన ప్రతిసారీ హిట్‌ కొట్టడంలో ఎక్కడో తడబడుతున్నారు డార్లింగ్‌ అని అంటున్నారు క్రిటిక్స్. ప్రభాస్‌ సినిమాలంటే హైప్‌ ఉండటం మామూలే. కానీ, ఊరించి ఊరించి ఆ హైప్‌ని మరింత స్ప్రెడ్‌ చేసినప్పుడు మాత్రం చేతులు కాల్చుకోక తప్పడం లేదు. రీసెంట్‌ రాజాసాబ్‌ విషయంలోనూ అదే ప్రూవ్‌ అయింది. జరిగిందేదో జరిగింది.. నెక్స్ట్ సినిమా పనుల్లో ఉన్నానంటూ డైరక్టర్‌ మారుతి పెట్టిన శ్రీరామనవమి పోస్టు ఇప్పుడు వైరల్‌ అవుతోంది. మారుతి నెక్స్ట్ మీద ఫోకస్‌ చేయడం మాట సరే, డార్లింగ్‌ ఏమనుకుంటున్నారు? ఫౌజీని దగ్గరుండి చూసుకుంటున్నారా? మాకు ఈ సారి హిట్‌ ఇవ్వడం ఖాయమా? అంటూ ఆసక్తిగా ఆరా తీస్తున్నారు అభిమానులు. ప్రస్తుతం సెట్స్ మీదున్న ఫౌజీ మీదే కాదు, స్పిరిట్‌ మీద కూడా చాలా ఆశలే పెంచుకున్నారు ప్రభాస్‌ ఫ్యాన్స్. మరోవైపు కల్కి సీక్వెల్‌ కూడా సెట్స్ మీదుంది. డార్లింగ్‌ లేని సన్నివేశాలతో షూట్‌ స్టార్ట్ చేశారు నాగీ. సో… చేతిలో ఉన్న ఈ సినిమాల్లో ఏదో ఒకటి ఇమీడియేట్‌గా హిట్‌ కావాలన్నది రెబల్‌ సైన్యంలో ఉన్న డిజైర్‌. కెరీర్‌ కాస్త అటూ ఇటూగా ఉన్నప్పుడు వచ్చి ట్రాక్‌ లో పెట్టారు ప్రశాంత్‌ నీల్‌. ఆయన చేతిలో ఉన్న డ్రాగన్‌ని త్వరగా కంప్లీట్‌ చేసి, శౌర్యాంగపర్వాన్ని లైన్లో పెడితే.. ఫౌజీ, స్పిరిట్‌, కల్కి2 తర్వాత పర్ఫెక్ట్ సినిమా పడ్డట్టుంటుంది అన్నది ఫ్యాన్స్ నుంచి వినిపిస్తున్న మరో వెర్షన్‌.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఉస్మానియా బిస్కెట్లు ఇష్టంగా తింటున్నారా.. ఇది చూడండి

తండ్రికి ప్రేమగా మిల్క్‌ షేక్‌ అందించి.. అనంత లోకాలకి పంపిన కుమార్తె..

ఇంటి ఆడపడుచులా.. గోమాతకు సీమంతం !!

చిన్న తప్పుతో నడవలేని స్థితికి చేరుకున్న.. హృతిక్‌ ప్రియురాలు

నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి కానీ.. ఇలా చేస్తారా ??

Follow Us