The Raja Saab: రాజాసాబ్‌కు రూ.100 కోట్ల నష్టం ??

Updated on: Jan 24, 2026 | 7:45 PM

మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన రాజా సాబ్ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ నష్టాలతో సతమతమవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు 90-100 కోట్ల రూపాయల వరకు నష్టాలు రావచ్చని ఫిల్మ్ సర్కిల్స్‌లో చర్చ నడుస్తోంది. బ్రేక్ ఈవెన్‌కు కూడా చేరుకోలేదని, ఇది ప్రభాస్ అభిమానులను నిరాశపరిచిందని సమాచారం.

రాజాసాబ్! ఎన్నో అంచనాల మధ్య మారుతీ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా గురించి ఇప్పుడో న్యూస్ అటు సోషల్ మీడియాలోనూ.. ఇటు ఫిల్మ్ సర్కిల్లోనూ వైరల్ అవుతోంది. రాజాసాబ్‌ సినిమాకు భారీ నష్టాలనే టాక్ కాస్త గట్టిగా వినిపిస్తోంది. దీంతో ఇదో పెద్ద హాట్ టాపిక్ గా మారిందిప్పుడు. కల్కి సినిమా సూపర్ డూపర్ హిట్ తర్వాత డార్లింగ్ ప్రభాస్‌ చేసిన సినిమా రాజాసాబ్. తనకు అచ్చొచ్చిన యాక్షన్ జానర్లో కాకుండా.. హర్రర్ సైకలాజికల్ థిల్లర్ జానర్లో ఈ సినిమా చేసేందుకు ప్రభాస్‌ ఒప్పుకున్నాడు. డైరెక్టర్ మారుతీ ఈ సినిమాను లార్జర్ దెన్ లైఫ్‌లా.. వెరీ గ్రాండియర్‌గా తెరకెక్కించాడు. ప్రొడ్యూసర్ టీజీ విశ్వ ప్రసాద్‌ కూడా దాదాపు 500 కోట్ల వరకు బడ్జెట్ పెట్టాడు. ఇలా గ్రాండ్ స్కేల్లో తెరకెక్కి.. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన రాజా సాబ్ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ప్రభాస్‌ ఫ్యాన్సైతే కాస్త ఎక్కువగానే నిరుత్సాహ పరిచింది. ఈ క్రమంలోనే ఈ మూవీ కలెక్షన్స్‌ గురించి ఇప్పుడో టాక్ బయటికి వచ్చింది. చాలా ఏరియాల్లో రాజాసాబ్ బ్రేక్ ఈవెన్‌కు కూడా చేరుకోలేదని.. దీంతో రాజాసాబ్‌ 90 నుంచి 100 కోట్ల వరకు నష్టాలపాలయ్యే ఛాన్సుందని ఫిల్మ్‌ సర్కిల్లో న్యూస్ వైరల్ అవుతోంది. మరి ఈ టాక్‌పై క్లారిటీ రావాలంటే.. మేకర్స్ నోరు విప్పేవరకు మెయిట్ చేయాల్సిందే.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

షాకింగ్‌ న్యూస్‌.. అరికాళ్ళపై షుగర్ దాడి

రూ. 78 లక్షల హాస్పిటల్‌ బిల్లును.. రూ.21 లక్షలకు తగ్గించిన AI

గ్రీన్‌ల్యాండ్ మంచు కింద అమెరికా అణు రియాక్టర్‌

సీక్వెల్స్ వస్తున్నాయి.. ఇప్పుడు కాదు.. మరి ఇంకెప్పుడు

Dhurandhar: ఇండియన్ సినిమాలో ధురంధర్ సంచలనాలు.. బాలీవుడ్‌లో రికార్డుల సునామీ

Published on: Jan 24, 2026 07:45 PM