హెల్లో నేటివ్ స్టూడియోలో షూటింగ్స్ సందడి

Edited By:

Updated on: Feb 25, 2026 | 7:20 PM

వేసవి తాపంతో వణుకుతున్నా, టాలీవుడ్ స్టార్ హీరోలు మాత్రం షూటింగ్స్‌లో బిజీగా ఉన్నారు. ప్రభాస్, మహేష్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి అగ్రతారలు తమ నెక్స్ట్ ప్రాజెక్ట్‌లను పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు. హెలో నేటివ్ స్టూడియో నుండి RFC వరకు, ముంబై నుండి మైసూరు వరకు వివిధ లొకేషన్లలో షూటింగ్స్ శరవేగంగా జరుగుతున్నాయి. తాజా సినిమా అప్‌డేట్స్, వారి షెడ్యూల్స్ గురించి తెలుసుకోండి.

సమ్మర్ సీజన్ మెల్లగా మొదలైపోయింది.. ఇప్పట్నుంచే ఎండలు మండిపోతున్నాయి. అయినా కూడా షూటింగ్స్ అస్సలు ఆపట్లేదు మన హీరోలు. ఎవరో అక్కడక్కడా ఒకరిద్దరు హీరోలు మినహా.. అందరూ లొకేషన్‌లోనే బిజీ బిజీగా ఉన్నారు. ముఖ్యంగా స్టార్ హీరోలంతా సెట్స్‌లోనే ఉన్నారు. సంక్రాంతి హీరోలు సైతం నెక్ట్స్ ప్రాజెక్ట్స్‌పై ఫోకస్ పెంచేసారు. మరి ఎవరి షూటింగ్ ఎక్కడ జరుగుతుందో చూద్దామా..? షూటింగ్ స్టోరీలో ముందు హెలో నేటివ్ స్టూడియో నుంచే మొదలుపెడదాం. నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న ప్యారడైజ్‌.. జేడీ చక్రవర్తి కొత్త సినిమా, శర్వానంద్ భోగి షూట్స్ ఆ స్టూడియోలోనే జరుగుతున్నాయి. ఇక దాసరి కళ్యాణ్ అధీరా సినిమా సెట్ వర్క్ అక్కడే జరుగుతుంది. మరోవైపు ప్రభాస్ ఒకేసారి రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రభాస్, హను రాఘవపూడి ఫౌజీ సినిమా షూటింగ్ RFCలో.. అలాగే ప్రభాస్ లేకుండా కల్కి 2 షూటింగ్ శంకరపల్లిలో జరుగుతుంది. మహేష్ వారణాసి షూటింగ్ గండిపేటలో నాన్ స్టాప్‌గా జరుగుతుంది. రామ్ చరణ్ పెద్ది షూట్ అల్యూమీనియం ఫ్యాక్టరీలో జరుగుతుంది. అల్లు అర్జున్ AA22 షూట్ ముంబైలో 40 రోజులుగా జరుగుతుంది. నాగార్జున 100వ సినిమా షూట్ మైసూర్‌లో జరుగుతుంది. వెంకీ, త్రివిక్రమ్ సినిమా షూటింగ్ రెండు వారాలుగా అన్నపూర్ణ 7 ఎకర్స్‌లో జరుగుతుంది. గోపీచంద్, సంకల్ప్ రెడ్డి చిత్ర షూటింగ్ అజీజ్ నగర్‌లో.. కిరణ్ అబ్బవరం చెన్నై లవ్ స్టోరీ చిత్ర షూటింగ్ పాండిచ్చేరిలో.. సంబరాల ఏటిగట్టు సినిమా షూటింగ్ తుక్కుగూడలో జరుగుతున్నాయి. మొత్తానికి హీరోలంతా ఫుల్ బిజీగా ఉన్నారిప్పుడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Samantha: సమంత ధీటైన జవాబు: సోషల్ మీడియాలో ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్

Sai Pallavi: బాలీవుడ్‌లో బిజీగా ఉన్న సాయి పల్లవి.. ఇక టాలీవుడ్ కు దూరమేనా

స్లో గా సైడ్ అవుతున్న స్టార్ హీరోలు. కళ తప్పుతున్న కోలీవుడ్

Kathi 2: వైరల్ అవుతున్న ఖైదీ 2 అప్‌డేట్.. సంతోషం వ్యక్తం చేస్తున్న అభిమానులు

YouTuber Komali: కోమలి ఫ్లాట్ లో సూసైడ్ నోట్.. చనిపోవడానికి కారణం ఇదేనా !

Follow Us