Adipurush AI Images: వీళ్లు ఇలా ఉండి ఉంటే.. ఆదిపురుష్ ఇంకో రేంజ్‌లో ఉండేదేమో..

|

Jun 22, 2023 | 8:56 AM

ప్రభాస్ ఆదిపురుష్ మూవీ..! అనౌన్స్మెంట్ దగ్గర నుంచే మోస్ట్ అవేటెడ్ మూవీగా ట్యాగ్ వచ్చేలా చేసుకుంది. రామాయణ గాథను కొత్తగా చూడబోతున్నామనే ఆశ.. అందరికీ పుట్టేలా చేసింది. జై శ్రీరామ్‌ నినాదాన్ని మరో సారి.. ఒక్కసారిగా.. విశ్వమంతా మారుమ్రోగేలా చేసింది.

ప్రభాస్ ఆదిపురుష్ మూవీ..! అనౌన్స్మెంట్ దగ్గర నుంచే మోస్ట్ అవేటెడ్ మూవీగా ట్యాగ్ వచ్చేలా చేసుకుంది. రామాయణ గాథను కొత్తగా చూడబోతున్నామనే ఆశ.. అందరికీ పుట్టేలా చేసింది. జై శ్రీరామ్‌ నినాదాన్ని మరో సారి.. ఒక్కసారిగా.. విశ్వమంతా మారుమ్రోగేలా చేసింది. సినిమా చూసేందుకు భారతీయులను ఎగబడేలా కూడా చేసింది. అలాంటి ఈ సినిమా రిలీజ్‌ అయ్యాక మాత్రం తీవ్ర విమర్శల పాలైంది. రామ.. రావణ వేశధారణ పై అందరూ విమర్శలు చేసేలా చేసుకుంది. వాల్మీకి రామాయణాన్ని వక్రీకరించారనే కామెట్ డైరెక్టర్‌పై తీవ్రంగా వచ్చేలా చేసింది. అయితే ఈ క్రమంలోనే ఆదిపురుష్ లీడ్‌ క్యారెక్టర్స్‌ను కొంత మంది ఏఐ టెక్నాలిజీతో డిజైన్ చేసి… తాజాగా నెట్టింట వాటిని వైరల్ చేస్తుండడంతో… ఓ కొత్త టాక్ బయటికి వచ్చింది. రాముడి క్యారెక్టర్‌ చేసిన ప్రభాస్‌.. రావణుడి క్యారెక్టర్‌ చేసిన సైఫ్ అలీ ఖాన్.. ఆదిపురుష్‌లోలా కాకుండా… ఏఐ డిజైన్ చేసినట్టు.. ఆ సినిమాలో కనిపించి ఉంటే.. ఆదిపురుష్ సినిమా మరో రేంజ్‌లో ఉండేదనే టాక్ నెట్టింట బలంగా వస్తోంది. ఇక ఆదిపురుష్ సినిమా మేకింగ్‌ పై.. ఇప్పటికీ విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నారు డైరెక్టర్ ఓం రౌత్. తన క్రియేటివిటీ పురాణాల గాథలను వక్కీకరించడం పై కాకుండా.. అద్భుతంగా తెరకెక్కించడం పై ఫోకస్ పెడితే.. బాగుంటుందనే కాంమెంట్ అన్ని వర్గాల నుంచి వచ్చేలా చేసుకుంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్‌ విషయంలో అది ఫేక్ న్యూస్‌.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.

Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్‌ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!