Peddi: పెద్ది ట్రైలర్.. ఆ విషయాలు గమనించారా..?

Edited By:

Updated on: May 20, 2026 | 7:03 PM

రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న ‘పెద్ది’ ట్రైలర్ భారీ అంచనాలను మరింత పెంచేసింది. రా అండ్ రస్టిక్ ఎమోషన్స్‌తో సాగిన ఈ ట్రైలర్‌లో చరణ్ పర్ఫార్మెన్స్ హైలైట్‌గా నిలిచింది. విజయనగరం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో జాన్వీ కపూర్, శివరాజ్‌కుమార్, జగపతిబాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఏఆర్ రెహ్మాన్ సంగీతం కూడా ట్రైలర్‌కు ప్రత్యేక ఆకర్షణగా మారింది.

ది మోస్ట్ అవైటెడ్ పెద్ది ట్రైలర్ వచ్చేసింది.. కొన్ని రోజులుగా బుచ్చిబాబు, నిన్నటికి నిన్న చిరంజీవి.. ఈ ట్రైలర్ గురించి చెప్పిన మాటలు విని ఆకాశమంత అంచనాలు పెంచుకున్నారు ఫ్యాన్స్. మరి వాళ్ల ఊహలకు తగ్గట్లే పెద్ది ట్రైలర్ ఉందా..? రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ నిజంగానే రంగస్థలం చిట్టిబాబును దాటేయబోతుందా..? పెద్ది ట్రైలర్ రివ్యూ చూద్దాం పదండి.. కొన్ని రోజులుగా ఇండస్ట్రీలోనే కాదు.. బయట ఫ్యాన్స్‌లోనూ బాగా వినిపిస్తున్న పేరు పెద్ది. సంక్రాంతి తర్వాత వస్తున్న పెద్ద సినిమా ఇదే. రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రంపై ముందు నుంచి భారీ అంచనాలున్నాయి. తాజాగా విడుదలైన ట్రైలర్‌తో ఆ ఎక్స్‌పెక్టేషన్స్ మరింత పెరిగిపోయాయి. రా అండ్ రస్టిక్‌గా సాగిన ఈ ట్రైలర్‌లో రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. ట్రైలర్ అంతా విజయనగరంలోని పెద్ది అనే కుర్రాడి చుట్టూనే తిరుగుతుంది. ఆ ఊరు కోసం పెద్ది ఏం చేసాడు.. దానికోసం ఆటను ఎలా వాడుకున్నాడు అనేది ఈ సినిమా కథ. కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్, జగపతిబాబు లాంటి సీనియర్స్ క్యారెక్టర్స్ బాగున్నాయి. జాన్వీ గ్లామర్, ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ పెద్ది సినిమాకు అదనపు ఆకర్షణ. ముంబైలో భారీ స్థాయిలో పెద్ది ట్రైలర్ లాంఛ్ జరిగింది. దీనికి రామ్ చరణ్, జాన్వీ కపూర్ సహా చిత్ర యూనిట్ అంతా హాజరయ్యారు. ముఖ్యంగా రామ్ చరణ్ న్యూలుక్ అదిరిపోయింది. ఒకప్పటి చిరుత, మగధీర రోజుల్ని గుర్తు చేస్తున్నారీయన. పెద్దిలో కూడా లాంగ్ హెయిర్‌తోనూ కనిపించారు చరణ్. ట్రైలర్ అంతా హైలీ ఎమోషనల్‌గా సాగింది. మామూలుగా అయితే స్టార్ హీరో సినిమా అంటే పాటలు, డాన్సులు, ఫైట్లను హైలైట్ చేస్తారు. కానీ పెద్ది ట్రైలర్‌ను పూర్తిగా స్టోరీ బేస్డ్‌గా కట్ చేసారు బుచ్చిబాబు. మరీ ముఖ్యంగా ట్రైలర్ చివర్లోకి వచ్చేసరికి ఎమోషనల్ నోట్‌లో ఎండ్ చేసారు బుచ్చిబాబు. చరణ్ కెరీర్‌లో బెస్ట్ పర్ఫార్మెన్స్‌లలో పెద్ది నిలిచిపోయేలా కనిపిస్తుంది. జూన్ 4న సినిమా విడుదల కానుంది ఈ సినిమా.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

MS Dhoni: రిటైర్మెంట్‌‌పై ధోనీ.. హింట్‌ ఇచ్చినట్లేనా?

Jayam Ravi: భార్య VS లవర్‌! దెబ్బకు పిచ్చోడిలా తయారైన స్టార్ హీరో

20లక్షల కోసం.. హీరోయిన్‌ను చంపేసిన భర్త?

పాపం! ఆ స్టార్‌ను చూస్తుంటే బాధేస్తోంది..

Peddi: అమ్మ బుచ్చి.. నీకోమో 30 కోట్లు.. హీరోకేమో 100 కోట్లా..

Follow Us