‘పెద్దిని వదలకుండా.. ఉండాల్సింది సరోజ్‌

Updated on: Jun 10, 2026 | 10:03 AM

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా తెరకెక్కించిన ‘పెద్ది’ భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో రాంబుజ్జి పాత్రలో దివ్యేందు శర్మ మెప్పించినా, ఆ పాత్రకు మొదట ఎంపికైనది బండి సరోజ్ కుమార్ అని తాజాగా వెల్లడైంది. అయితే ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో ఆయన ఈ అవకాశాన్ని వదులుకున్నట్లు తెలిపారు. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రామ్ చరణ్ పెద్ది మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. ఇప్పటికే ఈ సినిమా దాదాపు 300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. బుచ్చిబాబు సనా తెరకెక్కించిన ఈ సినిమాలో రామ్ చరణ్ క్రికెటర్ గా, కుస్తీ యోధుడిగా, రన్నర్ గా మూడు డిఫరెంట్ పాత్రలు పోషించాడు. తన అద్భుతమైన నటనతో సినిమాను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లిపోయాడు. ఈ సినిమాలో చరణ్‌తో పాటు రిమైనింగ్ స్టార్ క్యాస్ట్ కూడా తన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అందులో బాలీవుడ్ యాక్టర్ దివ్యేందు శర్మ.. రాంబుజ్జి అనే నెగెటివ్ షేడ్స్‌లో నటించి తన ప్రతిభ చూపించాడు. తన పర్ఫార్మెన్స్‌తో తెలుగు వాళ్లకు దగ్గరైపోయాడు. స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉన్నప్పటికీ తనదైన యాక్టింగ్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే ఈ రోల్ కోసం బుచ్చి బాబు మొదట తెలుగు ట్యాలెంటెడ్ నటుడు బండి సరోజ్ ను ఎన్నుకున్నాడట. ఈ విషయం ఇప్పుడు బయటికి వచ్చి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పెద్ది సినిమాలో రామ్ బుజ్జి పాత్రకు దివ్యేందు ఫస్ట్ ఛాయిస్ కాదట. డైరెక్టర్ బుచ్చిబాబు ఈ పాత్ర కోసం పబ్లిక్ స్టార్ బండి సరోజ్ కుమార్ ని అనుకున్నారట. పెద్ది కథతో పాటు తన రోల్ గురించి కూడా చెప్పారట. సరోజ కుమార్ కు కూడ ఈ రోల్ బాగా నచ్చేసిందట. అయితే అప్పటికే తన చేతిలో చాలా సినిమాలు ఉండడం, పైగా సహాయక పాత్ర కావడంతో పెద్ది సినిమా చేయలేనని సున్నితంగా తిరస్కరించాడట. ఈ విషయాన్ని స్వయంగా బండి సరోజ్ కుమారే ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టారు. అయితే పెద్ది సినిమాను రిజెక్ట్ చేసినా కూడా అదేమీ తన మనసులో పెట్టుకోకుండా… తన ‘పరాక్రమం’ ఈవెంట్ కు బుచ్చిబాబు హాజరయ్యాడని సరోజ్ చెప్పుకొచ్చాడు. పెద్ది సినిమా రిలీజ్ అయి హిట్టైన వేళ.. పబ్లిక్ స్టార్ కామెంట్స్ ఇప్పడు నెట్టింట వైరల్ గా మారాయి. అంతేకాదు ఒక వేళ దివ్యేందు బదులు బండి సరోజ్ కుమార్ రామ్ బుజ్జి రోల్ చేసి ఉంటే ఆ క్యారెక్టర్ మరింతగా పండేదని.. మంచి రెస్పాన్స్ వచ్చి ఉండేదని నెటిజన్లు నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మూడు గుడ్లకు రూ.500! బిల్లు చూసి షాకైన గెస్ట్, వైరల్ వీడియో

ఆటో డ్రైవర్ కు UPI ద్వారా.. రూ.15,682 పంపిన ప్రయాణికుడు.. ఆ తర్వాతే అసలు ట్విస్ట్‌!

భార్యాపిల్లలు ఇంట్లో ఉండగానే.. జేసీబీతో వచ్చి.. ఇంటిని కూల్చేసిన భర్త

ఐఫోన్‌ కావాలన్న ప్రియురాలు.. మైనర్‌ ఏం చోరీ చేసాడంటే..

ఎవరెస్ట్‌పై అద్భుతం..ఆరు రోజులు ఆహారం, ఆక్సిజన్ లేకున్నా బతికాడు!

Follow Us