Dhurandhar 2: తెలుగు ధురంధర్‌2 లో పాటలు ఉండవా.. ఇదేం మ్యాజిక్

Edited By:

Updated on: Mar 10, 2026 | 4:44 PM

ధురంధర్ సీక్వెల్ 'ధురంధర్‌: ది రివెంజ్' పాన్ ఇండియా చిత్రంగా విడుదలవుతోంది. డబ్బింగ్ వెర్షన్లలో పాటలను హిందీలోనే ఉంచాలని మేకర్స్‌కు విజ్ఞప్తులు వస్తున్నాయి. గతంలో డబ్బింగ్ సినిమాల్లో పాటలు మెప్పించలేకపోవడమే దీనికి కారణం. ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ కూడా మొదటి భాగాన్ని ప్రశంసించి, సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రత్యేక విజ్ఞప్తిని మేకర్స్ పరిగణనలోకి తీసుకుంటారా లేదా అనేది రిలీజ్ డేట్‌ వరకు వేచి చూడాలి.

రిలీజ్‌ టైమ్‌ దగ్గరపడుతున్న కొద్దీ రకరకాలుగా వార్తల్లో ఉంది ధురంధర్‌ సీక్వెల్‌. ఇప్పుడు అదర్‌ లాంగ్వేజెస్‌ నుంచి మేకర్స్ కి అందుతున్న రిక్వెస్టులు వాళ్లు కన్సిడర్‌ చేస్తారా? అనేది బిగ్‌ క్వశ్చన్‌. ఇంతకీ ఏంటా రిక్వెస్ట్? ఫిన్లాండ్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ స్టబ్‌కి ధురంధర్‌ మూవీ ఎంతగానో నచ్చిందట. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడటం మెప్పించిందన్నారు. అంతే కాదు, ఈ సినిమా సీక్వెల్‌ ‘ధురంధర్‌ ది రివెంజ్‌’ కోసం ఎదురుచూస్తున్నట్టు తెలిపారు. ధురంధర్‌ సీక్వెల్‌ కోసం మన దగ్గర కూడా చాలా మంది వెయిట్‌ చేస్తున్నారు. ఫస్ట్ పార్ట్ హిందీలో మాత్రమే విడుదలైంది. సెకండ్‌ పార్టును ప్యాన్‌ ఇండియా మూవీగా మల్టీలాంగ్వేజెస్‌లో రిలీజ్‌ చేస్తున్నారు. ధురంధర్‌ సెకండ్‌ పార్టు డబ్బింగ్‌ వెర్షన్లలో పాటలను మాత్రం హిందీలోనే ఉంచేయమని మేకర్స్ కి రిక్వెస్టులు అందుతున్నాయట. గతంలో అనువాదమైన చాలా సినిమాల్లో పాటలు మెప్పించలేకపోయాయన్నది నెటిజన్ల వెర్షన్‌. మరి మేకర్స్ కన్సిడర్‌ చేస్తారో లేదో తెలియాలంటే రిలీజ్‌ డేట్‌ దాకా వెయిట్‌ చేయాల్సిందే.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వెంకీ – కల్యాణ్‌రామ్‌ సినిమా పూర్తయ్యేది అప్పుడేనా

Ramayana: మార్చి నుంచి రామాయణ నయా షెడ్యూల్‌

Trisha: పార్ధిబన్ కు త్రిష కౌంటర్‌.. మైక్ దొరికిందని ఏది పడితే మాట్లాడావంటే..

స్కూల్‌ హెడ్‌మాస్టర్‌ నిర్వాకం.. పిల్లలతో మసాజ్‌..

రూపాయికే బ్రాండెడ్ షూస్.. ఎగబడిన జనం.. మరి మీకు కావాలా..

Follow Us