OG 2: ఓజీ 2 సెట్స్ మీదకు వెళ్లేదెప్పుడు..? పవన్‌, సుజీత్‌ ప్లానింగ్ ఏంటి?

Edited By:

Updated on: Jul 19, 2026 | 11:28 AM

'ఓజీ' ఘన విజయంతో 'ఓజీ 2'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే పవన్ కల్యాణ్ శస్త్రచికిత్సల కారణంగా ఈ సీక్వెల్ షూటింగ్ ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ గ్యాప్‌లో దర్శకుడు సుజీత్ ఇప్పటికే ప్రకటించిన 'బ్లడీ రోమియో' ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి, అనంతరం పవన్ కోలుకున్న తర్వాత 'ఓజీ 2'పై దృష్టి పెట్టేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఓజీ’ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాకు కొనసాగింపుగా ‘ఓజీ 2’ కూడా ఉంటుందని అనౌన్స్ చేయడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. సుజిత్ మరో ప్రాజెక్ట్‌ ఎనౌన్స్‌ చేసినా… ముందు ఓజీ 2నే పట్టాలెక్కుంతుదన్న వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. అసలు ఓజీ 2 స్టేటస్ ఏంటి..? ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుంది.? ‘రన్ రాజా రన్’, ‘సాహో’ సినిమాలతో తన మార్క్ చూపించిన డైరెక్టర్ సుజీత్.. ‘ఓజీ’ సినిమాతో నేషనల్‌ లెవల్‌లో హాట్ టాపిక్ అయ్యారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో.. దానికి పదింతలు స్టైలిష్‌గా ఓజీని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. సుజిత్ వర్కింగ్ స్టైల్‌ నచ్చి పవన్‌ కూడా ఓజీ 2 చేస్తానని మాట ఇచ్చారు. ‘ఓజీ 2’ అనౌన్స్మెంట్ వచ్చిన వెంటనే షూటింగ్ పట్టాలెక్కుతుందని చాలామంది భావించారు. కానీ ప్రజెంట్ సిచ్యుయేషన్‌ చూస్తుంటే అలా జరిగేలా కనిపించడం లేదు. పవన్ కల్యాణ్ సర్జరీ చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు. త్వరలో మరో భుజానికి కూడా సర్జరీ చేయించుకోబోతున్నారు. ఆయన పూర్తిగా కోలుకొని మళ్లీ షూటింగ్స్‌కు రావడానికి చాలా టైమ్ పడుతుంది. అందుకే ఇప్పుట్లో ఓజీ 2 సెట్స్ మీదకు వెళ్లే ఛాన్స్ కనిపించటం లేదు. పవన్ ఎలాగూ బ్రేక్ తీసుకుంటారు కాబట్టి ఈ గ్యాప్‌లో ఆల్రెడీ ఎనౌన్స్ అయిన బ్లడీ రోమియో మూవీని పట్టాలెక్కించే ప్లాన్‌లో ఉన్నారు సుజిత్. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయిన ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి త్వరలో ప్రీ ప్రొడక్షన్‌ పనులు మొదలు పట్టే ఆలోచనలో ఉన్నారు. పవన్‌ పూర్తిగా రికవర్ అయ్యేలోగా నాని సినిమాను పూర్తి చేసి మళ్లీ ఓజీ 2 మీద ఫోకస్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ ప్లానింగ్ ఎంత వరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Jana Nayagan: జన నాయగన్ రిలీజ్‌కు భారీ ఏర్పాట్లు.. 8000 థియేటర్లలో రిలీజ్‌

ప్రతి సినిమాకు కొత్త అవతారం… స్టార్ హీరోల మేకోవర్ వెనక భారీ కష్టం..!

Deepika Padukone: ప్రెగ్నెంట్‌గా ఉండి రిస్కీ స్టంట్స్‌.. దీపిక డెడికేషన్‌కు ఫిదా అవుతున్న ఇండస్ట్రీ

పెళ్లి తర్వాతే అసలైన జోరు… మ్యారీడ్ హీరోయిన్లదే ఇప్పుడు ఇండస్ట్రీలో హవా..!

Varun Tej: హిట్ సెంటిమెంట్ ను నమ్ముకున్న వరుణ్ తేజ్.. ‘కొరియన్ కనకరాజు’పై భారీ ఆశలు

 

Published on: Jul 19, 2026 11:25 AM
Loading...
Unable to load recommendations.
Follow Us