Dragon: 4 నిమిషాల్లోనే సోషల్ మీడియా షేక్.. డ్రాగన్‌తో ఆల్‌టైమ్ రికార్డ్ కొట్టిన ఎన్టీఆర్

Updated on: May 22, 2026 | 3:53 PM

ఎన్టీఆర్ నటిస్తున్న ‘డ్రాగన్’ మూవీ గ్లింప్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హై యాక్షన్ ఫిల్మ్ టైటిల్ గ్లింప్స్ కేవలం 24 గంటల్లోనే 64 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి ఆల్‌టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. ఎన్టీఆర్ కొత్త మేకోవర్, పవర్‌ఫుల్ విజువల్స్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

మే 19, అర్థరాత్రి సరిగ్గా 11 గంటల 52 నిమిషాలకు సోషల్ మీడియాను మొత్తం లూగర్ కబ్జా చేసేశాడు. ఇన్నాళ్లూ తన ఫ్యాన్స్‌ చూస్తున్న యంగ్ టైగర్‌ను కాకుండా… ఈ సారి తనలోని డ్రాగన్‌ను అందరికీ పరిచయం చేశాడు NTR. సిల్వర్ స్క్రీన్‌ పై ఫైర్‌ను.. తన ఫ్యాన్స్‌ గుండెల్లో బ్లడ్‌ ప్లెషర్‌ను ఒక్కసారిగా పెంచేశాడు. అంతేకాదు 4నిమిషాల 29 సెకండ్ల డ్రాగన్‌ గ్లింప్స్‌తో ఆల్ టైమ్ రికార్డ్‌ను క్రియేట్ చేశాడు. ఆఫ్టర్ వార్ 2 యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో చేస్తున్న హై యాక్షన్ జానర్ ఫిల్మ్ డ్రాగన్‌. ఎప్పటి నుంచో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సిసినిమా నుంచి ఎన్టీఆర్ బర్త్‌ డే సందర్భంగా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ అయింది. రిలీజ్ అవ్వడమే కాదు.. ఇప్పుడా గ్లింప్స్ నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ట్రెండ్ అవ్వడమే కాదు.. డ్రాగన్ గ్లింప్స్ కేవలం 24 గంటల్లోనే రికార్డు వ్యూస్‌ రాబట్టింది. అన్ని భాషల్లో కలుపుకుని ఏకంగా 64 మిలియన్లకు పైగా వ్యూస్‌ సొంతం చేసుకున్నట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది. ఇండియన్‌ సినిమాలో ఇప్పటివరకు ఏ గ్లింప్స్‌ వీడియోకు 24 గంటల్లో ఇంత పెద్ద మొత్తంలో వ్యూస్‌ రాలేదంటూ పోస్టర్‌ వదిలింది. ఇది చూసిన తారక్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారిప్పుడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Peddi: ఉప్పెన ట్విస్ట్‌ కంటే పెద్దిలో 100 రెట్లు ట్విస్ట్! చరణ్ బిగ్ హింట్!

Ram Charan: పెద్ది సినిమా ఏమో కానీ.. నా కూతురిని ఎత్తుకోలేకపోతున్నా

కోట్లు ఇచ్చినా రాని ఆనందం.. రైతన్నను మురిపించిన నేల తల్లి

సీఎం సార్.. నన్ను అమ్మేశారు.. కాపాడండి ప్లీజ్‌

Follow Us