ఎన్టీఆర్ , త్రివిక్రమ్ సినిమాపై ముదురుతున్న వివాదం

Updated on: Jul 09, 2026 | 9:30 AM

ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాపై గాడ్ ఆఫ్ వార్ వివాదం ముదురుతోంది. సినిమా పోస్టర్‌లోని ట్యాగ్‌లైన్‌, ప్రొడ్యూసర్ నాగవంశీ ట్వీట్‌పై తమిళులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. తమ ఆరాధ్య దైవం మురుగన్‌ను ఉత్తరాదికి చెందినవాడిగా చూపించడాన్ని ఖండిస్తున్నారు. ఈ వివాదంలో తమిళ జాతీయవాద పార్టీలు కూడా భాగమవుతుండటంతో చర్చ మరింత రాజుకుంది.

జూనియర్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రానున్న సినిమాపై వివాదం రోజురోజుకు ముదురుతోంది. గాడ్ ఆఫ్ వార్ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారం జరుగుతున్న ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైనప్పటి నుంచి వివాదాలు చుట్టుముట్టాయి. ముఖ్యంగా, ప్రొడ్యూసర్ నాగవంశీ ట్వీట్‌లో “ఉత్తరాదిలో జన్మించాడు” అనే పదాలపై తమిళనాడులో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.తమిళుల ఆరాధ్య దైవం మురుగన్‌ను ఉత్తర భారతంతో అనుసంధానించడం సరికాదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నామ్ తమిళర్ కచ్చి (ఎన్టీకే) అధినేత సీమాన్ ఈ వివాదంపై స్పందిస్తూ, మురుగన్‌ను ఉత్తర భారతానికి చెందినవాడిగా చూపించే ప్రయత్నం చేస్తే తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుందని హెచ్చరించారు. అయితే, ద్రవిడ దేశం చీఫ్ కృష్ణారావు సీమాన్ వ్యాఖ్యలను ఖండించారు. ఈ వివాదంపై చిత్ర బృందం ఇంకా స్పందించలేదు. సినిమా కథ సుబ్రహ్మణ్య స్వామి చుట్టూ తిరిగే పురాణ ఇతిహాసం కావచ్చని ఊహాగానాలున్నాయి.

మరిన్ని వీడియోల కోసం :

సౌత్‌ టాలెంట్ మీద ఆశలు.. బాలీవుడ్‌లో నయా ట్రెండ్‌

నెలలోపే ఓటీటీలో… బిగ్‌ స్క్రీన్‌కు భారీ గండి

గేమ్ ప్లాన్ మార్చిన టాప్ బ్యూటీస్‌..

Published on: Jul 09, 2026 09:30 AM
Follow Us