‘రామాయణ’ కోసం మేకర్స్ కొత్త ప్రమోషనల్ ప్లాన్..

Updated on: Jul 17, 2026 | 9:34 AM

నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న 'రామాయణ'పై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్స్‌కు మంచి అప్లాజ్ వచ్చింది. రిలీజ్ దగ్గరికి వస్తుండటంతో మేకర్స్ సరికొత్త ప్రమోషనల్ స్ట్రాటజీతో ముందుకెళ్తున్నారు. రామాయణంలోని విలువలను, గొప్పతనాన్ని నేటి తరానికి తెలియజేసేందుకు దేశవ్యాప్తంగా పాఠశాలల్లో భారీ సాంస్కృతిక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు.

నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ‘రామాయణ’పై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్స్‌కు మంచి అప్లాజ్ వచ్చింది. రిలీజ్ దగ్గరికి వస్తుండటంతో మేకర్స్ సరికొత్త ప్రమోషనల్ స్ట్రాటజీతో ముందుకెళ్తున్నారు. రామాయణంలోని విలువలను, గొప్పతనాన్ని నేటి తరానికి తెలియజేసేందుకు దేశవ్యాప్తంగా పాఠశాలల్లో భారీ సాంస్కృతిక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు.బెంగళూరు, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌ సహా 18 సిటీస్‌లోని 400లకు పైగా పాఠశాలల్లో.. దాదాపు 5 లక్షల మంది విద్యార్థులతో ఈ టీమ్ ఇంటరాక్ట్ అయింది. పిల్లలకు రామాయణాన్ని మరింత దగ్గర చేసేందుకు ‘మన సత్యం.. మన చరిత్ర’ అనే నినాదంతో డ్రాయింగ్, క్విజ్ పోటీలతో పాటు ఆసక్తికరమైన చర్చా కార్యక్రమాలను నిర్వహించారు. రామాయణంలోని కీలక ఘట్టాలను పిల్లలకు అర్థమయ్యేలా చేస్తున్నారు.దేశంలోనే అత్యంత ఆదరణ పొందిన ఇతిహాసం ఆధారంగా నితీష్ తివారీ రామాయణ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా నటిస్తుండగా, సాయి పల్లవి సీతాదేవిగా కనిపిస్తున్నారు. అలాగే కేజీఎఫ్ స్టార్ యష్ రావణాసురుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా నటిస్తున్నారు. ఈ ఎపిక్ డ్రామాలో విజువల్స్‌తో పాటు ఎమోషన్స్‌పై ఫోకస్ చేసారు నితీష్ తివారి.

Published on: Jul 16, 2026 01:20 PM
Loading...
Unable to load recommendations.
Follow Us