Adipurush: వివాదంలో ఆదిపురుష్.. కోర్టు ముంగిట ప్రభాస్ ఫిల్మ్
రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్తో.. సూపర్ డూపర్ రెస్పాన్స్ రాబట్టుకున్న ఆదిపురుష్... తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. సెన్సార్ బోర్డ్ మెంబరే ఈ మూవీ మేకర్స్ తీరుకు వ్యతిరేకంగా బాంబే హైకోర్టు మెట్లక్కడం ఇప్పుడు అందర్నీ షాకయ్యేలా చేసింది. బాలీవుడ్‌లో ఇదే బిగ్ టాపిక్ గా మారింది.
రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్తో.. సూపర్ డూపర్ రెస్పాన్స్ రాబట్టుకున్న ఆదిపురుష్… తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. సెన్సార్ బోర్డ్ మెంబరే ఈ మూవీ మేకర్స్ తీరుకు వ్యతిరేకంగా బాంబే హైకోర్టు మెట్లక్కడం ఇప్పుడు అందర్నీ షాకయ్యేలా చేసింది. బాలీవుడ్‌లో ఇదే బిగ్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్లో.. ప్రభాస్ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ఆదిపురుష్. మోషన్ క్యాప్చర్ టెక్నాలిజీతో తెరకెక్కుతున్న ఈ సినిమా.. టీజర్ రిలీజ్ నుంచే ఎన్నో వివాదాలకు కేరాఫ్ గా మారింది. ఈ సినిమాకు వ్యతిరేకంగా హిందుత్వ సంఘాలను గొంతులేపేలా చేసింది. అయితే తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్‌తో అవన్నీ.. కనిపించకుండా.. వినిపించకుండా పోయిన వేళ… సెన్సార్ బోర్డ్లో సనాతన్ ధర్మ ప్రచారకర్త సంజయ్ దీనానాథ్.. ఈసినిమాకు వ్యతిరేకంగా బాంబే హైకోర్టు కెళ్లారు. సెన్సార్ బోర్డ్ సర్టిఫికేషన్ కాకముందే.. మేకర్స్ ఈ సినిమా స్క్రీనింగ్ ఏర్పాటు చేయడాన్ని తప్పుబట్టిన ఈయన .. బాంబే హైకోర్ట్ న్యాయవాదులైన ఆవిష్ రాయ్, పంకజ్ మిశ్రాలతో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సినిమా విషయంలో ఎవ్వరి మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలంటే.. వివాదాలు.. విమర్శలు రాకుండా ఉండాలంటే.. సెంట్రల్ బోర్డ్ సర్టిఫికేషన్ తర్వాతే ఈ మూవీని స్క్రీనింగ్ చేయాలని .. ఆమేరకు మేకర్స్ ను ఆదేశించాలని సంజయ్ తన పిటిషన్లో కోరారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Kriti Sanon: మొదటి ఫొటోషూట్‌లోనే అలా జరగడంతో కన్నీళ్లతో ఇంటి కొచ్చిన కృతి సనన్..
Parineeti Chopra: ఆమె హీరోయిన్.. ఆయన పొలిటీషియన్ ప్రేమ నిజమైన వేళ…
The Kerala Story: ఓటీటీలోకి కేరళ స్టోరీ.. ఎప్పటి నుండి అంటే ??
Ustad Bhagat Singh: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్