Srikanth Odela: ‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?

Updated on: Sep 26, 2026 | 6:31 PM

నాని, శ్రీకాంత్‌ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన ‘ది ప్యారడైజ్‌’కు తొలిరోజే రూ.88 కోట్లకు పైగా గ్రాస్‌ వచ్చినట్లు నిర్మాతలు ప్రకటించారు. అయితే సినిమాకు మిక్స్‌డ్‌ రివ్యూలు వినిపిస్తున్న నేపథ్యంలో శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో చిరంజీవి నటించాల్సిన ప్రాజెక్ట్‌పై సోషల్‌ మీడియాలో చర్చ మొదలైంది. ఈ సినిమా షూటింగ్‌ సంక్రాంతి తర్వాత ప్రారంభమవుతుందని నాని గతంలో వెల్లడించాడు. ప్రాజెక్ట్‌ విషయంలో ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి మార్పు ప్రకటించలేదు. చిరు కోసం ఓదెల సిద్ధం చేసిన యాక్షన్‌ కథపై ఆసక్తి నెలకొంది.

‘ప్యారడైజ్’ సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. తొలిరోజు ఏకంగా రూ.88 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయని నిర్మాతలే అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ చిత్రానికి తొలి ఆట నుంచే ఎక్కువగా నెగిటివ్, మిక్స్‌డ్ రివ్యూస్ వినిపించాయి. దీంతో ఈ మూవీ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల.. తర్వాత చిరంజీవితో కలిసి పనిచేస్తాడా లేదా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఇంతకీ ఈ ప్రాజెక్ట్ సంగతేంటి? తెలంగాణలోని గోదావరిఖనికి చెందిన శ్రీకాంత్ ఓదెల.. సుకుమార్ దగ్గర పనిచేశాడు. ‘దసరా’తో దర్శకుడిగా పరిచయమయ్యాడు. కంటెంట్ పరంగా ఇది పర్లేదనిపించింది. ‘ప్యారడైజ్’కి వచ్చిన హైప్‌కి బ్లాక్‌బస్టర్ కొట్టేస్తారేమోనని అంతా అనుకున్నారు. కానీ డీసెంట్‌గా ఉందనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఫస్టాప్ అదరగొట్టినప్పటికీ సెకండాఫ్ విషయంలో చిన్న చిన్న తప్పిదాలు కనిపించాయని అంటున్నారు. అయితే ‘ప్యారడైజ్’ షూటింగ్ జరుగుతున్న టైంలోనే నాని నిర్మాతగా శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా చిరంజీవి హీరోగా ఓ సినిమాని ప్రకటించారు. ఫుల్ యాక్షన్ కథతో దీన్ని తీయబోతున్నట్లు హింట్ కూడా ఇచ్చారు. మరి ‘ప్యారడైజ్’కి మిశ్రమ స్పందన వినిపిస్తున్న నేపథ్యంలో ఆ ప్రాజెక్ట్ ఉంటుందా లేదా అనే సందేహాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. కొన్నిరోజుల క్రితం ‘ప్యారడైజ్’ ప్రమోషన్స్‌లో మాట్లాడిన నాని.. సంక్రాంతి తర్వాతే చిరు-శ్రీకాంత్ మూవీ షూటింగ్ మొదలవుతుందని అన్నాడు. మరి చిరు కోసం శ్రీకాంత్ ఓదెల ఎలాంటి కథ సిద్ధం చేశాడో? దీని గురించి అప్‌డేట్ ఎప్పుడిస్తారనేది చూడాలి?

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Hanuman Ansh: 400 కోట్ల వైపు పరుగులు.. 2 కోట్ల చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్

The Paradise: నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?

The Paradise: టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌

భూమి కొనేముందు.. ఈ నిజాలు తెలియకపోతే..నష్టపోతారు!

డేటింగ్ యాప్‌లో పరిచయం.. ఫ్లాట్ అమ్మేసి రూ.4.91 కోట్లు ఇచ్చేశాడు!

Loading...
Unable to load recommendations.
Follow Us