The Paradise: టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని నటించిన ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్ సాధించింది. వరల్డ్‌వైడ్ ప్రీమియర్స్‌తో కలిపి తొలి రోజే రూ.88 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. రూ.100 కోట్ల మార్క్‌ను అందుకోకపోయినా ఇది నాని కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్‌గా నిలిచిందని మేకర్స్ వెల్లడించారు. ఓవర్సీస్‌తో పాటు హిందీ, తమిళ్ మార్కెట్లలోనూ సినిమాకు మంచి స్పందన లభించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు.
అదిరిపోయిన ది ప్యారడైజ్ కలెక్షన్స్..! శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో నాని చేసిన మోస్ట్ అవేటెడ్ మూవీ ది ప్యారడైజ్. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ.. బాక్సాఫీస్ రిపోర్ట్ ఇప్పుడు అఫీషియల్‌గా బయటికి వచ్చింది. అందరూ ఎక్స్‌పెక్ట్ చేసినట్టు నాని 100 కోట్ల మార్క్‌ను టచ్ చేయకున్నా.. 88 కోట్లకు పైగా గ్రాస్ తో సాలిడ్ కలెక్షన్స్‌ను అయితే పట్టేశాడు నాని. వరల్డ్ వైడ్ ప్రీమియర్స్‌తో కలిపి డే వన్.. దాదాపు 88 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది ది ప్యారడైజ్ మూవీ. ఇదే విషయాన్ని అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది ఈ మూవీ టీం. నాని కెరీర్‌లోనే ఇది ఆల్ టైం రికార్డ్ ఓపెనింగ్స్. దీంతో ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పుడా పోస్టర్ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఓవర్సీస్ మాత్రమే కాదు హిందీ, తమిళ్ మార్కెట్లలోనూ నాని ప్యారడైజ్ మూవీ మంచి ఓపెనింగ్స్‌ను సాధించింది. మిక్స్‌డ్ టాక్ మధ్యలోనూ..బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్‌లో దూసుకుపోతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భూమి కొనేముందు.. ఈ నిజాలు తెలియకపోతే..నష్టపోతారు!
డేటింగ్ యాప్‌లో పరిచయం.. ఫ్లాట్ అమ్మేసి రూ.4.91 కోట్లు ఇచ్చేశాడు!
Depression: ఫేక్ నవ్వు వెనుక దాగిన బాధ.. మనసు మాట వినండి బ్రో.. నువ్వు డిప్రెషన్‌ను జయిస్తావు
Pink Power Run 3.0: హైదరాబాద్‌లో పింక్ పవర్ రన్ 3.0కి భారీ స్పందన
EPFO: ఈపీఎఫ్ ఖాతాదారు మరణిస్తే కుటుంబానికి ఏ ప్రయోజనాలు అందుతాయి? క్లెయిమ్ ప్రక్రియ ఇదే!
