అభిమానులకు బాలయ్య ఫోన్‌.. పట్టరాని సంతోషంలో ఫ్యాన్స్‌

|

Jan 14, 2025 | 3:48 PM

డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన సినిమా డాకు మహారాజ్. ఎప్పటిలాగే సంక్రాంతి బరిలో విడుదలైన ఈ సినిమాకు భారీ రెస్పాన్స్ వస్తోంది. బాలయ్య నటవిశ్వరూపం.. ఆయన యాక్షన్ ఎపిసోడ్స్, డైలాగ్స్, ఎలివేషన్లు చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. డైరెక్టర్ బాబీ బాలయ్యను ఎంతో చక్కగా చూపించారని.. ఈ సినిమాకు తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్ ఎప్పటిలాగే అదిరిపోయిందని ఫ్యాన్స్‌ అంటున్నారు.

నెట్టింట డాకు ను ట్రెండ్ చేస్తున్నారు. ఇక ఈక్రమంలోనే స్వయంగా బాలయ్యనే తన అభిమానులకు కాల్ చేసి పలకరించారట. సినిమా గురించి వారి రివ్యూను అడిగి తెలుసుకున్నారట. అయితే ఇందుకు సంబంధించిన ఆడియో క్లిప్‌ ఒకటి బయటికి వచ్చి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇక ఆ ఆడియో క్లిప్‌లో.. సినిమా ఎలా ఉందంటూ బాలయ్య తన అభిమానిని అడగ్గానే.. ఆ అభిమాని బ్లాక్ బస్టర్, బంపర్ హిట్టు అంటూ చెప్పుకొచ్చారు. కంగ్రాట్యులేషన్స్ అన్నగారు.. సూపర్ ఉంది సినిమా. మీ యాక్టింగ్ మాత్రం నటవిశ్వరూపం. అసలు ఫస్టాఫ్ చాలా పీక్ అన్నగారు. సెకండాఫ్ సెటిల్ యాక్టింగ్ చాలా బావుంది. ఒన్ మ్యాన్ షో అన్నగారు మీది. ప్లస్ థమన్ గారి బీజీఎం అదిరిపోయింది. బాబీ గారి టేకింగ్, విజువల్స్ అన్నీ కుదిరాయి.. మీ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఈసినిమా అంటూ ఓ ఫ్యాన్ సంతోషంగా బాలయ్యతో డాకు మహారాజ్‌ గురించి చెప్పారు ఆ అభిమాని.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Daaku Maharaaj: డాకు మహారాజ్ ఊచకోత.. బాలయ్య సినిమా రెండురోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే

గేమ్ ఛేంజర్ సినిమాపై కుట్ర.. పోలీస్‌ స్టేషన్లో కేసు

పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు.. ఇమ్యూనిటీని పెంచుకోండి ఇలా !!

ఏ వయసు వారు రోజూ ఎంత దూరం వాకింగ్​ చేయాలి

అబ్బాయిలూ ఇలా రెడీ అవండి.. చాలా స్పెషల్‌గా కనిపిస్తారు..