Nagarjuna: దసరాకు ధమాకా.. ‘కింగ్ 100’ నుంచి దిమ్మతిరిగే సర్‌ప్రైజ్‌

Updated on: Oct 18, 2026 | 3:13 PM

కింగ్‌ నాగార్జున నటిస్తున్న 100వ సినిమా ‘కింగ్‌ 100’పై అంచనాలు పెరుగుతున్నాయి. దసరా సందర్భంగా ఈ చిత్రం నుంచి టబు పవర్‌ఫుల్‌ లుక్‌తో కూడిన గ్లింప్స్‌ను విడుదల చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు ఫిల్మ్‌ నగర్‌లో ప్రచారం జరుగుతోంది. చాలా ఏళ్ల తర్వాత నాగార్జున, టబు మళ్లీ తెరపై కలిసి కనిపించనున్నారనే వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. అయితే గ్లింప్స్‌ విడుదల తేదీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

కింగ్ నాగార్జున 100వ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్‌లో నడుస్తోంది. ఇక ఇప్పటికే ఎన్నో అంచనాలున్న ఈ సినిమా నుంచి దసరా కానుకగా ఒక పవర్‌ఫుల్ సర్‌ప్రైజ్ రెడీ అవుతోంది! ‘కింగ్ 100’ నుంచి హీరోయిన్‌ టబుకు సంబంధించిన లుక్‌ను పరిచయం చేసేందుకు ఈ మూవీ టీం రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. దసరా పండుగ సందర్భంగా టబుకు సంబంధించిన ఓ ఇంటెన్స్, పవర్‌ఫుల్ గ్లింప్స్‌ను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని ఫిల్మ్ నగర్లో టాక్. నాగ్ , టబు ఈ జోడీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. వీరిద్దరూ కలిసి సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తే 90స్ కిడ్స్‌కి నాస్టాల్జియా మూమెంట్ అని చెప్పాలి. అంతటి క్రేజీ పెయిర్ .. చాలా ఇయర్స్ గ్యాప్ తర్వాత కింగ్ 100 వ సినిమా కోసం మళ్లీ ఆన్‌ స్క్రీన్ కెక్కడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఇక ప్రత్యేకంగా టబు గురించి చెప్పాలంటే.. తన యాక్టింగ్‌తో.. బ్యూటీతో ఇప్పటికీ అందర్నీ ఆకట్టుకుంటోంది ఈమె. ఎలాంటి క్యారెక్టర్‌నైనా తనదైన శైలిలో పండిస్తుంది. ఇక టబుకి తోడు పక్కనే ఎలాగూ కింగ్ ఉండనే ఉన్నారు. దీంతో ఇప్పుడు కింగ్ 100 నుంచి దసరా కానుకగా వస్తున్న ఈ సర్‌ ప్రైజ్ గ్లింప్స్‌ గురించి.. అండ్ టబు లుక్‌ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు ఈ గ్లింప్స్‌లో టబు క్యారెక్టరైజేషన్‌ను ఎలా చూపించబోతున్నారు? ఆమె పాత్ర కథలో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతోంది? అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అత్తామామలతో కలిసి.. CM విజయ్‌ను తన పెళ్లికి ఆహ్వానించిన అనిరుధ్

5నిమిషాలు కనిపించినందుకే.. హృతిక్‌కి భారీ రెమ్యునరేషన్!

Ranabaali: ‘రణబాలి’కి ఫస్ట్‌డే.. దిమ్మతిరిగే కలెక్షన్స్‌

తన బిడ్డ పెళ్లికి రావాలంటూ.. సీఎం రేవంత్‌కు మారన్ ఆహ్వానం

పెళ్లికి వేలైంది.. ఇన్విటేషన్స్ పంచుతున్న మారన్

Loading...
Unable to load recommendations.
Follow Us