Monalisa: హిందూ టూ ఇస్లాం.. మోనాలిసా మత మార్పిడి ??
మోనాలిసా, ఫర్మాన్ ఖాన్ కేరళలో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. కుంభమేళా సెన్సేషన్ మోనాలిసా తన ప్రియుడిని పెళ్లాడినప్పటికీ, మతం మారే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. ప్రేమ జిహాద్ ఆరోపణలను ఖండించింది. తన వయసుపై చెలరేగిన వివాదానికి కూడా బర్త్ సర్టిఫికెట్ తో తెరదించింది. ప్రేమకు మతం అడ్డుకాదని ఈ జంట తెలియజేసింది.
ప్రయాగ్‌రాజ్ కుంభమేళా సందర్భంగా రాత్రికి రాత్రే ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిన మోనాలిసా.. ఉన్నట్టుండి తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్‌ను కేరళలో వివాహం చేసుకుంది. కేరళలోని పూవార్ సమీపంలోని అరుమనూర్‌లోని నాయనార్ ఆలయంలో హిందూ సంప్రదాయాల ప్రకారం వీరి పెళ్లి జరిగింది. అయితే పెళ్లి హిందూ సంప్రదాయం ప్రకారమే జరిగినప్పటికీ… మోనాలిసా భర్తది ముస్లిం కంమ్యూనిటీ. దీంతో మోనాలిసా ముస్లిం కంమ్యూనిటీలోకి మారుతుందా? లేదా అన్న దానికిపై ఇప్పుడు సోషల్ ఓ చర్చ సాగుతోంది. ఇందుకు మోనాలిసా ఆన్సర్ ఇచ్చినప్పటికీ.. ఈ కారణంగానే మోనాలిసా.. తన భర్త హర్మాన్ ఖాన్ సమేతంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెళ్లి తర్వాత మీడియాతో మాట్లాడిన మోనాలిసా… తాను తన ప్రియుడు హర్మాన్ ఖాన్‌ను.. హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నానని.. తాను ముస్లిం అయినా కూడా… ఇస్లాం మతంలోకి మారకుండానే తన భర్తతో రిమైనింగ్ లైఫ్ కంటిన్యూ చేస్తానంటూ ఆమె చెప్పుకొచ్చింది. అంతేకాదు తమ మధ్య చిగురించిన ప్రేమ లవ్ జిహాద్ కానే కాదంటూ చెప్పుకొచ్చింది ఈమె. తామిద్దరం.. కళాకారులం… తాము అన్ని మతాలను గౌరవిస్తామని హర్మాన్ కూడా మీడియాతో చెప్పుకొచ్చారు. ప్రేమలో మతం మార్చుకోవాల్సిన అవసరం లేదని తన.. భార్య కూడా మతం మారదని అతను క్లియర్ కట్ గా చెప్పాడు. మరోవైపు మోనాలిసా మైనరా? మేజరా? అన్న విషయంపై తీవ్ర గందరగోళం నెలకొంది. దీనికి తెరదించుతూ ఆమె తన బర్త్ సర్టిఫికెట్ ను విలేకరుల సమావేశం సాక్షిగా అందరికీ చూపించింది.తనకు 18 ఏళ్లు నిండాయని క్లారిటీ ఇచ్చింది. ‘మోనాలిసా మేజర్ కాబట్టి, ఆమె ఇష్టానుసారం జీవించే హక్కు ఆమెకు ఉంది’ అని పోలీసు అధికారులు తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒక్కొక్కరికి బొట్టు పెట్టి చెప్పాలా.. నెటిజన్స్ తీరుపై హరీష్ శంకర్ అసహనం
Demon Pavan: ఓ పక్క తండ్రి మరణం.. ఇంకో పక్క తప్పుడు వార్తలు.. తట్టుకోలేక డీమాన్ భావోద్వేగ పోస్ట్
Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కు.. గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం
మోనాలిసా లవ్ మ్యారేజ్ పై.. తండ్రి, మామ ఎమోషనల్ రియాక్షన్
సినిమా చూడాలా లేక చదవుతూ కూర్చోవాలా ?? సెన్సార్ కొత్త నిర్ణయంపై హాట్ డిస్కషన్
