యాక్టింగ్ నేర్పించి, సినిమా ఛాన్స్ ఇస్తే.. నా పైనే నిందలా..!

Updated on: Mar 29, 2026 | 3:08 PM

మోనాలిసా తనను వేధించాడని సనోజ్ మిశ్రాపై చేసిన ఆరోపణలను సనోజ్ ఖండించాడు. 'లవ్ జిహాద్' వివాదం వల్లే మోనాలిసా తనపై నిరాధార ఆరోపణలు చేస్తోందని, ఆమె కుటుంబం ఇప్పటికీ తన ఇంట్లోనే ఉందని తెలిపాడు. మోనాలిసాపై పరువు నష్టం దావా వేస్తానని, న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నానని సనోజ్ మిశ్రా ప్రకటించాడు.

సినిమా పేరుతో.. సనోజ్‌ మిశ్రా తనను అసభ్యంగా తాకాడని.. వేధించాడని ఇటీవల మోనాలిసా తీవ్ర ఆరోపణలు చేసింది. మీడియా ముందర ఏడుస్తూ.. తాను అనుభవించిన బాధను వివరించింది. ఈ క్రమంలోనే మోనాలిసా ఆరోపణలపై తాజాగా సనోజ్ మిశ్రా రియాక్టయ్యాడు. తానేం తప్పచేయలేదని.. చెప్పాడు. బదులుగా మోనాలిసా పై పరువు నష్టం దావా వేస్తానన్నాడు. సోషల్ మీడియాలో వైరల్ అయిన మోనాలిసాను.. మొదట ఇంటికెళ్లి మరీ తన సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు సనోజ్ మిశ్రా. ఆమెకు యాక్టింగ్‌ లో శిక్షణ ఇచ్చి తాను తీస్తున్న ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ సినిమాలో మెయిన్‌ లీడ్‌ గా పెట్టుకున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న క్రమంలోనే మోనాలిసా తన ప్రియుడు ఫర్మాణ్ ఖాన్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. అయితే మోనాలిసా ప్రేమ వివాహాన్ని లవ్‌ జిహాద్ అంటూ సనోజ్ మిశ్రా ఆరోపణలు చేశాడు. ఆయన ఆరోపణలపై రియాక్టైన మోనాలిసా.. సనోజ్ మిశ్రా షూటింగ్ పేరుతో తనను వేధించాడని సంచలన ఆరోపణలు చేసింది. ఈ క్రమంలోనే మోనాలిసా తనపై చేసిన ఆరోపణలు అవాస్తవమని అన్నాడు సనోజ్ మిశ్రా. ఆమె కుటుంబంలోని దాదాపు 7-8 మంది ఇప్పటికీ ఉజ్జయిన్‌లోని తన ఇంట్లోనే నివసిస్తున్నారంటూ చెప్పాడు. తాను ఆమె పెళ్లి చెల్లదని చెప్పినందుకే.. మోనాలిసా తనపై ఆరోపణలు చేస్తోందని అన్నాడు సనోజ్ మిశ్రా. అంతేకాదు ఇన్ని రోజులూ తాను కష్టపడి డైలాగ్స్ చెప్పడం, నటించడం, కథను అర్థం చేసుకుని నవ్వడం, ఏడవడం అన్నీ నేర్పినప్పుడు మోనాలిసాకు ఎలాంటి సమస్యలు రాలేదని.. కానీ ఇప్పుడు మాత్రం తన పై లేని పోని ఆరోపణలు చేస్తోందన్నాడు. ఒకవేళ మోనాలిసాను తాను వేధించి ఉంటే.. అప్పుడే తన కుటుంబానికి ఫిర్యాదు చేసి ఉండాలి కదా.. అంటున్నాడు. తాను ఫర్మాన్ ఖాన్ తో మోనాలిసా పెళ్లి చెల్లదని చెప్పినందుకే మీడియా ముందుకు వచ్చి తనపై నిందలేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు సనోజ్ మిశ్రా. మోనాలిసాపై తాను చట్టపరమైన చర్యలు తీసుకుంటానని సనోజ్ మిశ్రా అన్నాడు. త్వరలోనే తనపై పరువు నష్టం దావా వేస్తానని చెప్పుకొచ్చాడు. ఒకటి రెండు రోజుల్లో పరువు నష్టం దావా వేస్తానని.. ఒకవేళ ఆమె చెప్పేది నిజమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని అన్నాడు. ఇకపై సినిమా నిర్మాణం జరగదని.. ఎందుకంటే ఆమె దాని గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రిషబ్ Vs రుక్మిణి.. తెర వెనుక ఏదో జరుగుతోందబ్బా…?

తెలంగాణ వాహనదారులకు గుడ్ న్యూస్.. DL, RC కార్డులు ఇక నేరుగా మీ ఇంటికి

Hey Balwanth: OTTలోకి వస్తున్న సుహాస్ న్యూ ఫిల్మ్

ట్రంప్‌ సంచలన నిర్ణయం.. అమెరికా కరెన్సీపై ట్రంప్‌ సంతకం

బంపర్‌ ఆఫర్‌.. నెలరోజులు అక్కడ బిర్యానీ ఫ్రీ..!

Follow Us