పాపం! ఆ స్టార్‌ను చూస్తుంటే బాధేస్తోంది..

Updated on: May 20, 2026 | 3:57 PM

Meera Chopra తాజాగా Jayam Raviకు బహిరంగ మద్దతు ప్రకటించడం కోలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. విడాకుల వివాదంలో ఎప్పుడూ మగవారినే తప్పుపట్టకూడదని, రవి వెర్షన్ కూడా వినాలని ఆమె వ్యాఖ్యానించారు. ఇప్పటికే Aarti Ravi, Khushbu Sundar ఎంట్రీలతో వేడెక్కిన ఈ వివాదం ఇప్పుడు మరింత హాట్ టాపిక్‌గా మారింది.

కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి అలియాస్ రవి మోహన్ , ఆయన భార్య ఆర్తి రవిల విడాకుల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ప్రెస్ మీట్‌లో జయం రవి మాట్లాడుతూ భార్య ఆర్తి, ఆమె కుటుంబ సభ్యులపై సంచలన ఆరోపణలు చేశాడు.పెళ్లయిన నాటి నుంచి తాను తీవ్ర అవమానాలు ఎదుర్కొన్నానని వాపోయారు. తనపై ‘చేతబడి’ కూడా చేయడంతో రక్తం కక్కుకున్నానని, మానసిక క్షోభతో ఆత్మహత్యకు యత్నించానని అందరి ముందు కన్నీరు పెట్టుకున్నారు. అయితే దీనికి భార్య ఆర్తి కౌంటర్ ఇచ్చింది. ఆ తర్వాత ఈ విడాకుల వివాదంలోకి ఖుష్బూ కూడా ఎంటరయ్యింది. మొత్తానికి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ, దుమ్మెత్తిపోసుకుంటూ కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారారు రవి- ఆర్తి జంట. తాజాగా ఈ విషయంలో జయం రవికి బహిరంగంగా మద్దతు పలికింది ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ మీరా చోప్రా. ఈ మేరకు రవి వెర్షన్ కూడా అందరూ వినాలని ఆమె ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టింది. ‘నాకు నటుడు జయం రవి చాలా బాగా తెలుసు. అతను ఎంతో సున్నితమైన, మంచి వ్యక్తి. ప్రతిసారీ తప్పు మగవాడిదే కానక్కర్లేదు. ఈ రోజుల్లో కొంతమంది మహిళలు తమకు అనుకూలంగా ఉన్న చట్టాలను, వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు. సమాజం ఎప్పుడూ ఒకరి ఆరోపణలే వినకూడదు. మగవారి వెర్షన్‌ను కూడా ప్రపంచం వినాలి. రవిని చూస్తుంటే బాధగా ఉంది. అతనికి ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని, నిజం గెలుస్తుందని ఆశిస్తున్నాను’ అని ఎక్స్ లో రాసుకొచ్చింది మీరా చోప్రా. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రాకు కజిన్ సిస్టర్ అయిన మీరా చోప్రా తెలుగు అభిమానులకు కూడా సుపరిచితమే. పవన్ కల్యాణ్ బంగారం, వాన వంటి సినిమాల్లో హీరోయిన్ గా చేసిందీ అందాల తార.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Peddi: అమ్మ బుచ్చి.. నీకోమో 30 కోట్లు.. హీరోకేమో 100 కోట్లా..

నిద్రపోతున్న సింహాన్ని లేపొద్దు.. జయం రవికి భార్య ఆర్తి కౌంటర్

ప్రేమ ఒప్పుకోలేదని.. కెనెడా నుంచి వచ్చి మరీ సింగర్‌ను చంపేసిన వ్యక్తి

‘నా కాపురంలో నిప్పులు పోసింది ఈమె!’ హీరో ఆరోపణపై ఖుష్బూ రియాక్షన్

Loading...
Unable to load recommendations.
Follow Us