పెళ్లి తెచ్చిన లక్.. బ్లాక్‌బస్టర్ కమ్‌బ్యాక్..!

Edited By:

Updated on: Jul 17, 2026 | 4:18 PM

టాలీవుడ్‌లో కొందరు స్టార్లకు పెళ్లి తర్వాత అదృష్టం కలిసి వచ్చినట్లుగా కనిపిస్తోంది. అఖిల్ అక్కినేని ‘లెనిన్’తో, నాగచైతన్య ‘తండేల్’తో, కిరణ్ అబ్బవరం ‘క’తో, సమంత ‘మా ఇంటి బంగారం’తో భారీ విజయాలు అందుకున్నారు. పెళ్లి అనంతరం కెరీర్‌లో కీలక మలుపు తిరిగి, ఎన్నాళ్లుగానో ఎదురుచూసిన బ్లాక్‌బస్టర్‌లను సొంతం చేసుకోవడంతో ఈ స్టార్ల ప్రయాణం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

పెళ్ళైంది.. సుడి తిరిగింది అంటారు కదా..? మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఇప్పుడిదే. డిస్కస్ చేయడానికి కాస్త ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది ఈ విషయం. యాదృశ్చికమో ఏమో కానీ మన ఇండస్ట్రీలో చాలా మంది స్టార్స్‌కి పెళ్లి బాగా కలిసొచ్చింది.. మూడు ముళ్లు పడగానే ఎన్నాళ్ల నుంచి వేచి చూస్తున్న విజయం కాళ్ల ముందుకొచ్చేసింది. మరి మ్యారేజ్ తర్వాత కమ్ బ్యాక్ ఇచ్చిన స్టార్స్ ఎవరో చూద్దామా..? అఖిల్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి దశాబ్ధం దాటిపోయింది. ఆయన కంటే తర్వాత వచ్చిన వారసులు కూడా సక్సెస్ అయ్యారు కానీ అయ్యగారికి మాత్రం హిట్ రాలేదు. నాగార్జున ఎంత ప్రయత్నించినా.. హెలో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ లాంటి సినిమాలకు టాక్ బాగా వచ్చినా బ్లాక్‌బస్టర్ బాకీ పడిపోయింది. ఇప్పుడా లోటు లెనిన్ తీర్చేస్తుంది.. నాగ్ చెప్పినట్లు పెళ్లితోనే అయ్యగారి టైమ్ స్టార్ట్ అయిందేమో..? పెళ్లికి ముందు చేసిన సినిమాలేవీ పెద్దగా ఆడలేదు.. కానీ గతేడాది జైనాబ్‌ను పెళ్లి చేసుకున్నారు అక్కినేని వారసుడు. అదేంటో మరి.. ఆఫ్టర్ మ్యారేజ్ విడుదలైన ఫస్ట్ సినిమాతోనే కమ్ బ్యాక్ ఇచ్చారు అఖిల్. సమంతకు పెళ్లి బాగానే కలిసొచ్చింది.. చైతూతో విడిపోయాక సోలోగా ఉన్నపుడు చేసిన శాకుంతలం డిజాస్టర్ అయింది.. కానీ రాజ్‌ను పెళ్ళాడాక చేసిన మా ఇంటి బంగారం బ్లాక్‌బస్టర్ అయింది. భర్త రాజ్ నిడిమోరు రాసిన కథతో నందిని రెడ్డి తెరకెక్కించిన మా ఇంటి బంగారంతో ఏకంగా 100 కోట్లు వసూలు చేసింది సమంత. తెలుగు ఇండస్ట్రీలో హైయ్యస్ట్ కలెక్షన్స్ తెచ్చిన లేడీ ఓరియెంటెడ్ సినిమాగా నిలిచింది మా ఇంటి బంగారం. ఇంతకంటే బెస్ట్ కమ్‌బ్యాక్ ఏముంటుంది చెప్పండి..? సేమ్ థింగ్ నాగ చైతన్య తండేల్ విషయంలో జరిగింది. థ్యాంక్యూ, కస్టడీ లాంటి డిజాస్టర్స్‌తో కెరీర్‌లో బాగా వెనకబడిపోయిన టైమ్‌లో తండేల్‌తో 100 కోట్ల విజయాన్ని అందుకున్నారు చైతూ. డిసెంబర్ 2024లో శోభితా ధూళిపాళ్లతో పెళ్లి.. ఫిబ్రవరి 2025లో కమ్ బ్యాక్.. చైతూకు అలా కుదిరిపోయింది..! కిరణ్ అబ్బవరం కూడా రహస్య గోరక్‌ను పెళ్లాడిన తర్వాతే ‘క’ సినిమాతో అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చారు. మొత్తానికి మన స్టార్స్‌కు మూడు ముళ్లు బాగానే కలిసొచ్చాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఒక్క విద్యార్థి.. ముగ్గురు సిబ్బంది.. ప్రభుత్వ పాఠశాల ఆశ్చర్యకర గాథ!

పెన్షన్‌ కోసం బ్యాంకుకు వెళ్లిన వృద్ధుడు.. అకౌంట్లో బ్యాలెన్స్‌ చూసి షాక్‌!

రైలు కిటికీకి వేలాడుతూ 15 కి.మీ. ప్రయాణం..!

కదులుతున్న రైలులో పూజ‌లు.. రైల్వే అధికారుల రియాక్షన్‌ ఇదే!

పోలీసువైనంత మాత్రాన చట్టం నీ చుట్టం కాదు బాస్‌!

Follow Us