Mamitha Baiju: నెల రోజుల్లో మూడు భారీ సినిమాలు.. మమిత బైజు దండయాత్రకు రెడీ!

Edited By:

Updated on: Jul 21, 2026 | 6:36 PM

‘ప్రేమలు’తో గుర్తింపు తెచ్చుకున్న మమిత బైజు ఇప్పుడు వరుస భారీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ‘జన నాయగన్’, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’, ‘బెత్లెహెం కుటుంబం’ చిత్రాలు నెల రోజుల్లోనే విడుదలకు సిద్ధమవడంతో ఆమె కెరీర్ కీలక మలుపు తిరిగింది. తమిళ, మలయాళ పరిశ్రమల్లో ఒకేసారి తన మార్క్ చూపించాలని ఈ యంగ్ హీరోయిన్ లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఇండస్ట్రీలో ఎవరి టైమ్ ఎప్పుడెలా టర్న్ అవుతుందో తెలియదు. తాజాగా మలయాళ బ్యూటీ మమిత బైజును చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. కొన్ని నెలలుగా విడుదల కాని సినిమా వచ్చేస్తుంది.. అలాగే లైన్‌లో ఉన్న మూవీస్ అన్నీ ఒకేసారి క్యూ కడుతున్నాయి. నెల రోజుల్లోనే 3 భారీ సినిమాలతో దండయాత్రకు సిద్ధమవుతున్నారు ప్రేమలు బ్యూటీ. మరి ఏంటా సినిమాలు మనం కూడా చూద్దామా..? సెన్సేషన్ ఆఫ్ సౌత్.. ఇప్పుడు ఈ మాట మమిత బైజుకు బాగా సెట్ అవుతుంది. నెల రోజుల్లోనే మూడు భారీ సినిమాలతో బాక్సాఫీస్ మీద దండయాత్ర చేస్తున్నారు ఈ భామ. జూలై 23న విజయ్ జన నాయగన్ రిలీజ్ కానుంది. ఆర్నెళ్లుగా బాక్సుల్లోనే ఉండిపోయిన ఈ సినిమా.. మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకొచ్చేస్తుంది. మమిత తమిళ కెరీర్‌కు ఇది ఇంపార్టెంట్ సినిమా. విజయ్ సినిమా థియేటర్లలో ఉండగానే.. ఆగస్ట్ 14న సూర్యతో నటిస్తున్న విశ్వనాథ్ అండ్ సన్స్‌తో మరోసారి ఆడియన్స్ ముందుకు రానున్నారు మమిత. 40 ఏళ్ళ వ్యక్తిని ప్రేమించే 20 ఏళ్ళ అమ్మాయిగా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ చేస్తున్నారు మమిత బైజు. నేషనల్ అవార్డ్ విన్నర్ వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకుడు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ విశ్వనాథ్ అండ్ సన్స్‌ సినిమాను నిర్మిస్తుంది. విశ్వనాథ్ అండ్ సన్స్‌ వచ్చిన వారం రోజుల్లోనే ఆగస్ట్ 21న నివిన్ పాలితో జోడీ కట్టిన బెత్లెహెం కుటుంబ యూనిట్ విడుదల కానుంది. మలయాళంలో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. మొత్తానికి నెల రోజుల్లోనే మూడు భారీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు మమిత. వీటితో పాటు ప్రస్తుతం ప్రదీప్ రంగనాథన్ సినిమా చేస్తున్నారు ఈ భామ. డ్యూడ్ తర్వాత ఈ కాంబో రిపీట్ అవుతుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ramayana Leak: ‘రామాయణ’ ట్రైలర్ లీక్ వెనక అసలు కథ ఏంటి..? పైరసీనా.. ప్రమోషన్ ప్లానా?

Bhagyasree Borse: ‘ఐరెన్ లెగ్’ అంటూ నన్నే ఎందుకు..? హిట్ తర్వాత భాగ్యశ్రీ బోర్సే ఘాటు కౌంటర్!

Salman Khan: కండల వీరుడికి ఏమైంది..? సల్మాన్ ఖాన్ కొత్త లుక్ చూసి షాక్‌లో అభిమానులు!

భారీ సినిమాల దర్శకుల కొత్త మిషన్.. చిన్న సినిమాలకు పాన్ వరల్డ్ సపోర్ట్!

God Of War: డిసెంబర్ నుంచి పట్టాలెక్కనున్న ‘గాడ్ ఆఫ్ వార్’.. తారక్ కోసం గురూజీ మైథాలజీ మ్యాజిక్!

Follow Us